EPAPER

Ram Charan’s RC16 : బుచ్చిబాబు మాస్ ప్లాన్… రామ్ చరణ్ కోసం తంగలాన్ టీం..

Ram Charan’s RC16 : బుచ్చిబాబు మాస్ ప్లాన్… రామ్ చరణ్ కోసం తంగలాన్ టీం..

Ram Charan’s RC16 : మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు రావడంతో పాన్ ఇండియా కంటెంట్ తోనే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ఇటీవలే అనౌన్స్ చేశారు. డిసెంబర్ 20న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా గురించి పక్కన పెడితే, రామ్ చరణ్ నుంచి రాబోతున్న మరో మూవీ RC16. ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు దీనికి డైరెక్టర్. దీనికి వర్కింగ్ టైటిల్ RC16. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు కాస్ట్ అండ్ క్రూ ఎంపిక కూడా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది.


RC16 విషయంలో బుచ్చిబాబు ఎక్కడా కూడా కంప్రమైజ్ అవ్వకుండా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. అందులో భాగంగానే, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను ఈ మూవీలో ఓ కీలక పాత్ర చేయడానికి ఒప్పించాడని టాక్. రామ్ చరణ్ ను ఉన్న గ్లోబల్ ఇమేజ్ కి శివరాజ్ కుమార్ తోడైతే, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని ఇప్పటికే క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. పైగా బుచ్చిబాబు స్టోరీ, స్క్రీన్ ప్లే విధానం ఇప్పటికే ఉప్పెన మూవీతో చూశారు. ఆ మూవీ అప్పుడే 100 కోట్లు కలెక్ట్ చేసింది. మరీ సినిమాలో ఇప్పుడు స్టార్ హీరోలు, అగ్ర నటీనటులు ఉంటే, బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఎలాంటి సునామీ సృష్టిస్తుందో అంచనా కూడా వేయాలేమని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇది ఇలా ఉండగా, ఈ అంచనాలను ఎక్కడా తగ్గకుండా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు. సినిమాలో స్టార్ హీరోలు ఉండటంతో పాటు స్టార్ టెక్నిషియన్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నాడు బుచ్చిబాబు. ఈ క్రమంలో కోలీవుడ్ కి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ ఏగన్ ఏకాంబరంను ఈ మూవీకి తీసుకున్నాడు ఈ విషయాన్ని ఏగన్ ఏకాంబరం స్వయంగా తన సోషల్ మీడియాలో తెలిపాడు. ” నేను టాలీవుడ్‌లో పని చేయడం ఇదే మొదటి సారి. ఈ క్షణం కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా.. ఫైనల్ గా ఆ రోజు వచ్చింది. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించిన దర్శకుడు బుచ్చిబాబు సనకు నా కృతజ్ఞతలు. రామ్‌చరణ్ సర్‌తో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను. దీంతో టాలీవుడ్ నుంచి నేను కొత్త విషయాలు నేర్చుకుంటాను. అలాగే పద్దతలు మరింత తెలుసుకోవడానికి ఇదో మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు.


కాగా, ఈ సినిమాకి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Related News

Lucky Bhaskar Day 3 Collections: బాక్సాఫీస్ వద్ద ‘లక్కీ భాస్కర్ ‘ జోరు.. రికార్డులు బ్రేక్ చేసే కలెక్షన్స్..?

Amaran Collections : బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తున్న’ అమరన్ ‘ కలెక్షన్స్.. మూడు రోజులకు ఎన్ని కోట్లంటే?

Venky Atluri: నేను ఒక కథ రాస్తున్నప్పుడు ఆ జోనర్ కి సంబంధించిన 30,40 సినిమాలు చూస్తాను

Varun Tej : తొలిప్రేమ’ టైటిల్ వాడినందుకే వణికాను.. ఇక చిరంజీవిగారి టైటిల్ వాడాలంటే?

Varun Tej: నేను కేవలం మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను, అంతకుమించి బ్రెయిన్ వాడను కూడా

Kollywood: సెలబ్రిటీ డాగ్ ని బలి తీసుకున్న దీపావళి సెలబ్రేషన్స్… సినిమాలో జరిగినట్టే…!

Leo 2 : “లియో” సీక్వెల్ ఎప్పుడో చెప్పేసిన లోకేష్ కనగరాజ్

Big Stories

×