BigTV English
Advertisement

Jani Master: జానీ మాస్టర్‌కు ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసా?

Jani Master: జానీ మాస్టర్‌కు ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసా?

Jani Master : అసిస్టెంట్ ను లైంగికంగా వేధించిన జానీ మాస్టర్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ముంబైలో ఉన్న జానీ మాస్టర్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. గత రెండు రోజుల నుంచి జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు కూడా చేశారు. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. అవి ఏంటంటే..?


కొన్నాళ్లుగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న నార్త్ కి చెందిన అమ్మాయి (21) సడన్ గా బయటికి వచ్చి, తన పై జానీ మాస్టర్ గత కొన్ని సంవత్సరాలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్క సారిగా సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు వచ్చాయి. ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రిటీలు దీనిపై స్పందించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించి, బాధిత యువతికి అండగా నిలిచారు. అలాగే తన సినిమాల్లో అవకాశం ఇస్తా అని కూడా భరోసా ఇచ్చారు అల్లు అర్జున్.

ఈ విషయం పక్కన పెడితే, జానీ మాస్టర్ పై సెప్టెంబర్ 15న కేసు నమోదు అయింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ గురించి పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జానీ మాస్టర్ కేసుపై స్పందించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఈ నెల 15న కేసు నమోదు చేసినట్టు తెలిపారు. జానీ పై మొదట మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత జానీ పై పోక్సో కేసు కూడా నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


అలాగే ప్రస్తుతం జానీ పరారీ లో ఉన్నాడని, అతనిపై నాన్ బెయిలబుల్ కేస్ కూడా ఉందట. ఈ కేసుకు సంబంధించి పోలీసులపై ఒత్తిడి ఉంది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇలాంటి కేస్ లలో పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సాక్ష్యాలు, బాధిత యువతి స్టేట్మెంట్ పక్కాగా రికార్డు చేసిన తర్వాతే, పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.

అలాగే గత మూడు రోజులుగా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని, పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు జాని మాస్టర్ పరారై ఉంటాడని పోలీసులు అనిమానిస్తున్నారు. ఇదిలా ఉండగా, బాధిత యువతి అటు మహిళా కమిషన్ను ఆశ్రయించింది. మూడు గంటల పాటు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బాధితురాలికి సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను మహిళా కమిషన్ ఆదేశించింది.

కాగా, సాధారణంగా పోక్సో కేసు నమోదు అయితే, ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ పై కూడా పోక్సో కేసు నమోదు అయింది. ఇప్పుడు యువతి చేస్తున్న ఆరోపణలు నిజం అయితే, నేరం రుజువు అయితే, జానీ మాస్టర్ కి కూడా 7 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×