Uttar Pradesh News: తనతో మాట్లాడటానికి నిరాకరించినందుకు కోపంతో రగిలిపోయాడు ఆ యువకుడు. ఆమెతో గొడవకు దిగాడు. చివరకు ఫ్రెండ్స్‌తో కలిసి మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మంటల్లో ఉండగా తనను కాపాడాలంటూ ఆమె మొర పెట్టుకుంది. చివరకు ఆసుపత్రికి వెళ్తూ మార్గ మధ్యలో మృతి చెందింది. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది. ఈ ఘటన లక్నోకు 190 కిలోమీటర్ల దూరంలో జరిగింది.
యూపీలోని ఫరూఖాబాద్ జిల్లా ఝిఝుకి గ్రామానికి చెందిన టీచర్ బలరామ్‌సింగ్ చౌహాన్, తన కూతురు నిషాకు 2013లో వివాహం చేశారు. మొహమ్మదాబాద్ కొత్వాలి ప్రాంతంలోని జల్లాపూర్ గ్రామానికి చెందిన అమిత్ సింగ్ చౌహాన్‌తో పెళ్లి జరిగింది. అమిత్ సింగ్ ఢిల్లీలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేస్తున్నాడు. నిషా తన ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు రుద్ర కాగా, మరొక శౌర్య.
వారితో కలిసి ఫతేఘర్‌లోని నెక్‌పూర్ చౌరాసి ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇదిలావుండగా నిషాసింగ్‌ని కొద్దిరోజులుగా వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు దీపక్ అనే వ్యక్తి. తనతో మాట్లాడాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. మొన్న శనివారం నిషా ఏదో పని నిమిత్తం తన తండ్రి ఇంటికి వచ్చింది. ఆ పని తర్వాత అక్కడి నుంచి డాక్టర్ దగ్గరకు బయలుదేరింది.
ఆమె స్కూటీపై వెళ్తుండగా ఆమెని అడ్డగించాడు దీపక్. ఆ తర్వాత ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో రగిలిపోయిన దీపక్, అతడి ఫ్రెండ్స్‌తో కలిసి నిషాపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమె కేకలు వేస్తూ స్కూటర్ నడుపుతూ ఆసుపత్రికి చేరుకుంది. మార్గ మధ్యలో తనను కాపాడాలంటూ కేకలు వేసింది.
ALSO READ: హైదరాబాద్ లో భారీగా పాత నోట్లు.. దాదాపు రెండు కోట్లు సీజ్
స్థానిక ఆసుపత్రికి చేరుకోగానే బాధితురాలిని చూసిన డాక్టర్, వెంటనే ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అక్కకు చేరుకున్న ఆయనకు కూతురు కొన్ని విషయాలు చెప్పింది. డాక్టర్ సూచన మేరకు ఆమెని మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నిషా ఈ లోకాన్ని విడిచిపెట్టింది.
ఆదివారం సాయంత్రం పోస్ట్‌మార్టం తర్వాత బంధువులు నిషా మృతదేహాన్ని అప్పగించారు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఒంటికి దీపక్ నిప్పు పెట్టాడని నిషా తనతో చెప్పినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితురాలి తండ్రి. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.