Wife Elope | భర్త, ముగ్గురు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న ఓ యువతి. అనూహ్యంగా మాయమైపోయింది. భర్త రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఆస్పత్రిలో ఉండగా.. ఖర్చుల కోసం ఇంటి నుంచి డబ్బులు తీసుకొచ్చేందుకు వెళ్లింది. అంతే మళ్లీ తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రెండు రోజుల తరువాత ఊరి చివర ఒక కాలువలో ఆమె మృతదేహం లభించింది. ఆమెను హత్య కేసులో షాకింగ్ విషయాలు తెలిసాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం శ్రావస్తి జిల్లాలో డిసెంబర్ 8, 2024న ఊరి చివర కాలువలో పోలీసులుకు ఒక మృతదేహం లభించింది. రెండు రోజుల పాటు ఆమె ఎవరో పోలీసులు గుర్తించలేకపోయారు. ఆ తరువాత డిసెంబర్ 10, 2024న ఒక వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రి మార్చువరీ (శవాల గది) కి వచ్చి ఆమె తన భార్య శ్యామల దేవి (పేరు మార్చబడినది) అని గుర్తుపట్టాడు. ఆ వ్యక్తి చనిపోయిన యువతి శ్యామలదేవి భర్త కన్వర్ లాల్. అతను తన భార్య హత్యకు గురైందని.. ఆ హత్య చేసింది చిరౌంధాపూర్ అనే గ్రామంలో నివసించే విజయ్ పాస్వాన్ అనే అనుమానం వ్యక్తం చేశాడు. తన భార్య మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయలు దేరి తిరిగి రాలేదని తెలిపాడు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ముందే ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.
Also Read: 40 ఏళ్లుగా ఒకే భర్త నుంచి 12 సార్లు విడాకులు తీసుకున్న మహిళ.. తలలు పట్టుకున్న అధికారులు!
ఈ కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులు.. నిందితుడు విజయ్ పాస్వాన్ కోసం చిరౌంధాపూర్ వెళ్లగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసుల బృందం అతని కోసం గాలించి డిసెంబర్ 24న ఒక నిర్మానుష ప్రాంతంలో దాగి ఉన్న అతడిని అరెస్టు చేసింది. పోలీస్ స్టేషన్ లో అతడిని విచారణ చేయగా.. విజయ్ పాస్వాన్ తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. కానీ అతను వివరాలు షాకింగ్ గా ఉన్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. కన్వర్ లాల్, శ్యామల దేవికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారిద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ రెండు సంవత్సరాల క్రితం శ్యామల దేవికి బాబు అలియాస్ విజయ్ పాస్వాన్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విజయ్ పాస్వాన్ తో శ్యామల వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో అతనితో ఎక్కువగా కలిసేది. ఇదంతా ఆమె భర్తకు నచ్చేది కాదు. శ్యామల దేవి తరుచూ తన ప్రియుడితో కలిసేందుకు వెళుతుండడంతో భార్యా భర్తల మధ్య గొడవలు జరిగేవి. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది.
మరోవైపు శ్యామల దేవి.. ఇక తన భర్తను వదిలి ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ విజయ్ పాస్వాన్ కు ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అందుకే తన తల్లిదండ్రులు మరో యువతితో వివాహం నిశ్చయించారని చెప్పాడు. తన భర్త, పిల్లలతోనే ఉండాలని ఆమెకు సూచించాడు. అయినా శ్యామల దేవి అతడిని వదల్లేదు. తనకు భర్త పిల్లలు వద్దని.. ప్రియుడే కావాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ 19న ఉదయం కన్వర్ లాల్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వర్ లాల్ ఆస్పత్రిలో ఉండగా.. వైద్య ఖర్చుల కోసం ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని శ్యామలా దేవిని భర్త పంపించాడు.
దీంతో ఆ రోజు తన ముగ్గురు పిల్లలను ఆస్పత్రిలోనే వదిలేసి శ్యామలదేవి ఇంట్లో ఉన్న రూ.40000 నగదు, రూ.5 లక్షలు విలువ చేసే నగలు తీసుకొని బయలుదేరింది. ఆమె ఆస్పత్రికి వెళ్లకుండా తన ప్రియుడి వద్దకు వెళ్లింది. అతనితో ఊరి వదిలి పారిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. కానీ విజయ్ పాస్వాన్ కు ఇదంతా నచ్చలేదు. భర్త, పిల్లలను ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన మహిళతో కలిసి జీవించడానికి అతను ఇష్టపడలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో విజయ్ పాస్వాన్ ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని శ్రావస్తి నగరం బయట పడేశాడు.