UP Crime News: ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ వింతలకు ఉత్తరప్రదేశ్ కేరాఫ్‌గా మారిపోయింది. రెండు వారాల కిందట కాబోయే అల్లుడితో అత్త లేచిపోయింది. ఈ ఘటన కళ్ల ముందు ఊహించుకునే లోపు మరొక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కూతురు మామతో లేచిపోయింది ఓ ఇల్లాలు. ఈ వ్యవహారంపై ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
స్టోరీలో ఏం జరిగింది?
యూపీలోని బాదౌన్ ప్రాంతం కొత్త వింతకు వేదికైంది. 43 ఏళ్ల మమత-సునీల్ కుమార్‌కు వివాహం జరిగింది. మమకు చిన్న వయసులో పెళ్లి జరిగింది. సునీల్ కుమార్ ట్రక్కు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆ ఉద్యోగం గురించి చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. 15 రోజులు లేదా నెలకు ఒక్కసారి లాంగ్ టూర్ వెళ్లి ఇంటికి సునీల్‌కుమార్ వచ్చేవాడు. ఈ లెక్కన ఉద్యోగం పేరిట ఫ్యామిలీకి దూరంగా ఉండేవాడు.
ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందట కూతురికి పెళ్లి చేశారు మమత-సునీల్ దంపతులు. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది. కూతురు మామ పేరు శైలేంద్ర. వయస్సు దాదాపు 46 ఏళ్లు ఉంటాయి. ఫ్యామిలీకి భర్త దూరంగా ఉండడంతో మమత మనసు డైవర్ట్ అయ్యింది. శైలేంద్ర కాస్త అందంగా ఉండేవాడు. అత్తింటిలో కూతురు బాగోగుల నిమిత్తం అప్పుడప్పుడు ఫోన్ చేసేది మమత. ఆ విధంగా శైలేంద్రకు మరింత దగ్గరైంది.
ఈ విషయం తన కూతుర్ని తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసింది. దీంతో వియ్యంకుడి శైలేంద్రతో మమత మనసు కలిసింది. సునీల్‌కుమార్ ఇంట్లో లేనప్పుడు శైలేంద్ర వియ్యంకుడి ఇంటికి నెలకు నాలుగుసార్లు వచ్చేశాడు. ఇంట్లో ఉన్న పిల్లలను మరో గదిలోకి పంపేది మమత. కొన్నాళ్లుగా ఈ వ్యవహారం జరుగుతూ వచ్చింది. పిల్లలకు ఏ మాత్రం అనుమానం రాకుండా మేనేజ్ చేసింది మమత.
ALSO READ: ఆక్టోపస్ కానిస్టేబుల్‌ను చంపింది వాళ్లేనా? వెలుగులోకి సంచనల నిజాలు
దగ్గర బంధువు కావడంతో ఎవరికీ పెద్దగా అనుమానాలు రాలేదు. ఆ విధంగా జాగ్రత్త పడ్డారు మమత-శైలేంద్ర జంట. ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో శైలేంద్ర, మమత ఇంటికి వచ్చేవాడు. తెల్లవారుజామున నాలుగు లేదా ఐదు గంటలకు వెళ్లిపోయేవాడు. అయినా చుట్టుపక్కల వారు పెద్దగా పట్టించుకోలేదు. ఇది కరెక్టు కాదని మమత-శైలేంద్రలు ఇంటి నుంచి పారిపోయారు. వెళ్లేటప్పుడు మమత డబ్బుతోపాటు బంగారం తీసుకెళ్లినట్టు సమాచారం.
క్యాంప్‌కు నుంచి ఇంటికి వచ్చాడు సునీల్ కుమార్. గడిచిన నాలుగు రోజులుగా అమ్మ కనిపించలేదని, ఇంట్లో డబ్బు లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు సునీల్‌కుమార్. తెలిసివాళ్లకు ఫోన్ చేసి కనుగొన్నాడు. చివరకు వియ్యంకుడి ఇంటికి ఫోన్ చేస్తే శైలేంద్ర ఇంటికి రావడం లేదని తెలిసింది. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు సునీల్‌కుమార్.
ఫ్యామిలీకి దూరంగా ఉండడమే సునీల్ తప్పా?
చివరకు సునీల్ కుమార్ నోరు విప్పాడు. తాను ట్రక్ డ్రైవరని, ఒక్కోసారి దూర ప్రయాణాలు ఉండేవని చెప్పాడు. ఇంట్లో ఇబ్బందులు ఉండకుండా క్రమం తప్పకుండా డబ్బు పంపేవాడినని చెప్పారు. క్యాంపుల వల్ల నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడనని తెలిపాడు. భార్య మమత తరచుగా శైలేంద్రని ఇంటికి ఆహ్వానించేదని వెల్లడించాడు. చివరకు ప్రేమ వ్యవహారం నడిపి, అతనితో పారిపోయిందన్నాడు. నగలు, నగదు తీసుకుని వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సునీల్ కుమార్ పిల్లలు సైతం పలు విషయాలు ప్రస్తావించారు. తన తండ్రి అరుదుగా ఇంట్లో ఉండేవారని తెలిపారు. వారానికి ఒకసారి అమ్మ మమతా.. శైలేంద్రను ఇంటికి పిలిచేదని తెలిపారు. తమని వేరే గదికి పంపి, వేరే గదిలో ఉండేదని చెప్పారు. చివరకు మామయ్యతో అమ్మ పారిపోయిందన్నారు. అంతేకాదు అర్థరాత్రి వేళ శైలేంద్ర.. మమత ఇంటికి వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు. పొరుగువారికి కనపడకుండా తెల్లవారుజామున వెళ్లి పోయేవాడని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు.