Odela 2 : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా బాటియా ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి క్రేజ్ ను అందుకుంది. తన అందాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు మకాం మార్చింది.. వరుస సినిమాలతో బిజీగా మారింది. అటు తమిళ ఇండస్ట్రీలో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నది. తాజాగా ఓదెల 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భయంకరమైన సీన్లు ఉన్నా కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
కొన్ని చోట్ల ఓదెల 2 భారీ షాక్..
హీరోయిన్ తమన్నా నటించిన రీసెంట్ మూవీ ఓదెల 2 ఇటీవల రిలీజ్ అయ్యింది. ఊహించని విధంగా నెగెటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దీంతో తొలి రెండు రోజులు అనుకున్న దాని కంటే బాగా కలెక్షన్లు తక్కవగా వచ్చాయి. అయితే, వీకెండ్ అయిన కొన్ని చోట్ల ఎక్కువగా ఆకట్టుకోలేదు. మామూలు థియేటర్లలో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలు సైతం వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ను రాబడుతున్నాయి. కానీ ఓదెల 2 కు మాత్రం వీకెండ్ నిరాశ తప్పలేదు. కొన్ని చోట్ల షోలు కూడా క్యాన్సిల్ కూడా అయ్యాయి. ఓదెల 2 చిత్రానికి ఇలాంటి ఫలితం మాత్రం ఊహించనిదే. ఓదెల 2 చిత్రంలో నాగసాధు భైరవిగా తమన్నా భాటియా నటించారు. ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‍ప్లే అందించిన సంపత్ నంది.. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు.. ప్రమోషన్స్ లో గట్టిగానే చేశారు. కానీ మూవీ నిరాశ పరిచింది.
Also Read :రూ. 7.75 లక్షలతో ఫ్యాన్సీ నెంబర్.. బాలయ్య అంటే తగ్గేదేలే…
ఓదెల 2 కలెక్షన్స్..
హీరోయిన్ తమన్నా నటించిన ఓదెల 2 మూవీ గతంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వచ్చింది. ఓదెల సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కలెక్షన్స్ కూడా డీలా కొట్టింది. తొలి రెండు రోజుల్లో సుమారు కేవలం రూ.2 కోట్ల కలెక్షన్లే దక్కించుకున్నట్టు అంచనాలు ఉన్నాయి. మూడో రోజు కూడా పెద్దగా లెక్క పెరిగేలా లేదు. ఇందులో వశిష్ఠ నెగిటివ్ రోల్ లో నటించింది. ఇక యువ, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి కీరోల్స్ చేశారు. ఈ మూవీకి అజ్నిష్ లోకనాథ్ దర్శకత్వం వహించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‍వర్క్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆత్మ కిరాతకంగా మారింది. తిరుపతి ఆత్మ గ్రామానికి వస్తుంది. కొత్తగా పెళ్లైన వధువులను తిరుపతి టార్గెట్ చేస్తాడు. ముగ్గురు మరణాల తర్వాత గ్రామస్తులు రాధ దగ్గరికి వెళతారు. నాగ సాధువు అయిన తమన్నా ఆ ఊరిని కాపడుతుంది. ఆ ఊరిని ఆమె కాపాడటంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి స్టోరీ లైన్ ఉంటుంది.