Octopus Constable Death: ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు దాంపత్య బంధాలను కడతేర్చేలా చేస్తున్నాయి. ఆ మోజులో పడి కట్టుకున్నవాడిని, కడుపున పుట్టిన పిల్లలను చంపేందుకు కూడా వెనకాడట్లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా కూడా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. తద్వారా జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. వివాహేతర సంభంధాలు కుటుంబాలను అల్లకల్లోలం చేస్తున్నాయనడానికి ఆ ఘటనే ఓ ఉదాహరణ.
శుక్రవారం నాడు మంగళగిరి అక్టోపస్ హెడ్ కానిస్టేబుల్ ఫరూక్ అనుమాదస్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అతడి మృతి దేహం ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని ఓ ఘాట్ వద్ద లభించింది. తాజాగా నంద్యాల జిల్లా అక్టోపస్ కానిస్టేబుల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కానిస్టేబుల్ ఫరూక్‌కు నంధ్యాలలో ఓ మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం. తల్లితో సహజీవనం చేస్తున్న క్రమంలోనే కూతురితోను ఎఫైర్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పచ్చర్ల ఘాట్ సమీపంలో కానిస్టేబుల్ మృతదేహం లభ్యం అయ్యింది. ఫరూక్ స్వగ్రామం ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు. మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్‌లో ఫరూక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్న ఫరూక్ ఉద్యోగరీత్యా గుంటూరులోనే నివాసం ఉంటున్నాడు. ఈ వారంలో సెలవు మీద గుంటూరు నుంచి నంధ్యాలకు వచ్చిన ఫరూక్.. 3 రోజుల సెలవు ముగిసినా ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నంద్యాలకు చెందిన తల్లితో సహజీవనం, యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, కానిస్టేబుల్ ఎఫైర్ పెట్టుకున్న మువతికి మరో యువకుడితో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. కాగా, పక్కా ప్లాన్‌తో కానిస్టేబుల్‌ను హతమార్చినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కూతురి ప్రియుడు హతమార్చాడా..? కూతురుతో ఎఫైర్ నడుపుతున్నందుకు తల్లే హతమార్చిందా? అనే విషయం సస్పెన్స్‌గా మారింది. మూడు రోజుల క్రితమే ఫరూక్ హత్యకు గురైనట్లు సమాచారం. కాగా, ఫరూక్ హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఫరూక్ మిత్రులు పరారీలో ఉన్నట్లు సమాచారం.
Also Read: కృష్ణవేణి ఆగు చావొద్దు! అమ్మ ముందే బిల్డింగ్‌పై నుంచి దూకేసి..
ఇదిలా ఉంటే.. వరంగల్ జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. చీరతో ఉరివేసుకుని అర్చన అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. కాజీపేట దర్గా ప్రాంతంలో ఘటన జరిగింది. అర్చనకు 2022లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే అర్చన విడాకులు తీసుకుంది. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. కొద్దిరోజులుగా డ్యూటీకి సెలవు పెట్టి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నది. పెళ్లికావడంలేదని ఇటీవలే నీలిబండతండాలో.. మహిళా కానిస్టేబుల్ నీలిమ ఆత్మహత్య చేసుకుంది. మహిళా కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలతో పోలీసువర్గాల్లో కలవరం మొదలైంది.