Bangalore Crime News: దేశంలోని ముఖ్యమైన నగరాల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా నడవాలంటే యువతులు, మహిళలు హడలిపోతున్నారు. రైల్వేస్టేషన్ నుంచి సోదరుడితో ఇంటికి వెళ్తున్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తుల గల గ్యాంగ్. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. మరికొందరిపై గాలింపు చేపట్టారు. అసలు గ్రీన్‌సిటీలో ఏం జరిగింది?
ఏం జరిగింది?
కర్ణాటకలో జరిగిన దారుణమైన ఒకటి వెలుగులోకి వచ్చింది. బీహార్‌కు చెందిన ఓ యువతి తన సోదరుడితో కలిసి మిడ్ నైట్ బెంగళూరులో నడుచుకుంటూ వెళ్తోంది. వారిని అడ్డుకున్న కొందరు వ్యక్తులు ఆమె సోదరుడ్ని చావ బాదారు. చివరకు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.
బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువతి పని నిమిత్తం కేరళలోని ఎర్నాకులం వెళ్లింది. అక్కడ పని నచ్చకపోవడంతో తిరిగి తన సొంతూరు వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యింది. వెంటనే కేరళలో రైలు ఎక్కింది. అదే సమయంలో బెంగుళూరులో నివాసం ఉంటున్న తన సోదరుడికి ఫోన్ చేసింది. బెంగుళూరులోని కేఆర్ పురం రైల్వేస్టేషన్‌లో దిగితే తాను వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పాడు. అందుకు సరేనని తల ఊపింది.
ALSO READ: రన్నింగ్ ట్రైన్‌లో వీడియోలు తీసి, మైనర్‌పై లైంగిక వేధింపులు
ఏప్రిల్ రెండు అర్థరాత్రి
ఏప్రిల్ రెండున బుధవారం మిడ్ నైట్ ఒంటి గంట సమయంలో బెంగుళూరులోని కెఆర్ పురం రైల్వే స్టేషన్‌లో దిగింది ఆ యువతి. అన్నట్టుగానే సోదరుడు వచ్చిన యువతిని పికప్ చేసుకున్నాడు. రైల్వే స్టేషన్ నుండి భోజనం చేయడానికి మహాదేవపుర మార్గం వైపు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు.
అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న కొందరు వ్యక్తులు ఆమె సోదరుడ్ని, ఆమెని అడ్డగించారు. పలు ప్రశ్నలు వేసి వారికి కంగారు పెట్టారు. ఈ క్రమంలో మాటామాటా చోటు చేసుకుంది. ఈ క్రమంలో యువతి సోదరుడిపై దాడి చేశారు వారంతా. ఆ తర్వాత యువతిని ఈడ్చుకుంటూ నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. యువతి గట్టిగా కేకలు వేసింది.
అలర్టయిన స్థానికులు, ఆపై పోలీసులు
యువతి గట్టిగా కేకలు వేయడంతో అటువైపు వెళ్తున్నవారు ఇద్దరు వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి అత్యాచారం కేసు నమోదు చేశారు పోలీసులు. చివరకు బాధితురాలు, ఆమె సోదరుడు జరిగిన ఘటన గురించి పోలీసులకు వివరించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అప్పటికే స్థానికులు ఇద్దర్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఘటన జరిగిన ఐదు నిమిషాల్లో ఇద్దరు అరెస్టయ్యారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరి కోసం గాలింపు మొదలుపెట్టారు. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మహదేవపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల్లో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారిద్దరు కోలార్ జిల్లా ముల్బాగిల్ తాలూకాకు చెందినవారు. పని నిమిత్తం బెంగళూరుకు వచ్చిన వారు, ఆ రాత్రి ఆటోలో నిద్రపోయారు. అదుపులోకి తీసుకున్నవారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియాల్సివుంది.