High Cholesterol: కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కంటే పెరిగినప్పుడు.. అది రక్త నాళాలలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. శరీరంలోని వివిధ భాగాలలో.. ముఖ్యంగా కాళ్ళలో వివిధ సమస్యలకు దారితీస్తుంది. కాళ్ళలో నొప్పి, తిమ్మిరి, చలిగా అనిపించడం వంటి సమస్యలు కొలెస్ట్రాల్ పెరుగుదలకు సంకేతాలు కావచ్చు. సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే.. అది తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తుంది. పెరిగిన కొలెస్ట్రాల్ పాదాలను ఎలా ప్రభావితం చేస్తుందో, ఏ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం .
కాళ్ళలో నొప్పి :
ఎటువంటి కారణం లేకుండా మీ కాళ్ళలో తరచుగా నొప్పి లేదా బరువుగా అనిపిస్తే.. అది రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి సంకేతం కావచ్చు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల.. ధమనులు ఇరుకుగా మారతాయి. అంతే కాకుండా దీని కారణంగా సరైన మొత్తంలో ఆక్సిజన్, పోషకాలు కూడా కాళ్ళకు చేరలేవు.
పాదాల్లో తిమ్మిరి:
రక్త ప్రసరణకు అంతరాయం కలిగినప్పుడు.. పాదాలలో తిమ్మిరి లేదా జలదరింపు లాగా కూడా అనిపిస్తుంది. మీరు ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటే ఆ సమస్య మరింత పెరుగుతుంది. ఇది పదే పదే జరిగితే..అస్సలు లైట్ తీసుకోవద్దు.
పాదాలలో చలి:
మీ పాదాల ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు అనిపించినా లేదా.. ఎల్లప్పుడూ చల్లగా అనిపిస్తే.. అది రక్త ప్రసరణ సరిగా లేక పోవడానికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా ఒక పాదం మరొక పాదం కంటే చల్లగా అనిపిస్తే.. అది ఆందోళన కలిగించే విషయం అని మీరు గుర్తుంచుకోవాలి. వెంటనే మీరు డాక్టర్ ను సంప్రదించాలి.
నడవడంలో ఇబ్బంది లేదా తిమ్మిరి:
పెరిగిన కొలెస్ట్రాల్ కాళ్ళ ధమనులలో అడ్డంకిని కలిగిస్తుంది. అంతే కాకుండా నడుస్తున్నప్పుడు తిమ్మిర్లు లేదా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇది సాధారణంగా ఎక్కువ సేపు నిలబడటం లేదా నడిచేటప్పుడు మనం గుర్తించవచ్చు. విశ్రాంతి తర్వాత మెరుగు పడటం కూడా జరుగుతుంది.
మీ పాదాలపై చిన్న చిన్న గాయాలు కూడా త్వరగా మానకపోతే.. మీ శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా పనిచేయడం లేదనడానికి సంకేతం కావచ్చు. ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే సమస్య తీవ్రం అవడానికి ముందుగానే జాగ్రత్త పడాలి.
Also Read: షాంపూ లేకుండానే.. వీటితో హెయిర్ వాష్ చేసుకోవచ్చు తెలుసా ?
ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?
పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలు మీలో ఉండే మాత్రం వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అంతే కాకుండా అధిక కొవ్వు పదార్ధాలను తినకుండా ఉండండి. భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను సకాలంలో గుర్తించాలంటే కొలెస్ట్రాల్‌ను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ అదుపులో ఉండటానికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. పోషకాహారం తినాలి. ఇలా చేయడం వల్ల మాత్రమే మీకు కొలెస్ట్రాల్ సమస్య రాకుండా ఉంటుంది