BigTV English

Vishnu : ‘మ్యాడ్ స్క్వేర్’ లడ్డు కు, విజయ్ దేవరకొండకు సంబంధం ఏంటో తెలుసా..?

Vishnu : ‘మ్యాడ్ స్క్వేర్’ లడ్డు కు, విజయ్ దేవరకొండకు సంబంధం ఏంటో తెలుసా..?

Vishnu : ఈ ఏడాది ఉగాది కానుకగా మార్చి 28 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతో పాటుగా అటు కోట్లు వసూలు చేస్తుంది. ఈ మూవీలో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటివరకు 78 కోట్లు వసూల్ చేసింది. అయితే ఈ మూవీలో లడ్డు పాత్రలో నటించిన విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటనకే జనాలు ఫిదా అయ్యారు అందుకే సినిమా పూర్తయ్యేంతవరకు కడుపు బార్ నవ్వుకున్నారు. అయితే ఈ లడ్డు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారట. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా బయటపెట్టారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మ్యాడ్ సీక్వెల్స్..

2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ మూవీ వచ్చింది. ఈ రెండు సినిమాలలో లడ్డు పాత్ర కామన్ గా నడిచింది. ఈ లడ్డు పాత్రలో నటుడు విష్ణు అందర్నీ పడీ పడీ నవ్వించాడు. రెండు సినిమాల్లోనూ ఇతని పాత్ర బాగా వర్కౌట్ అయింది. అయితే ఇతను ఎప్పట్నుంచో సినిమాల్లో ఉన్నాడు. అయితే లడ్డు కూడా విజయ్ దేవరకొండ బ్యాచ్ అని ఓ వార్త వినిపిస్తుంది.. అవును మీరు విన్నది నిజమే.. విజయ్ దేవరకొండకు ముందే విష్ణు పరిచయమట..


Also Read :దారుణంగా పడిపోయిన ‘మ్యాడ్ స్క్వేర్’ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

విజయ్ దేవరకొండకు, లడ్డుకు మధ్య రిలేషన్? 

విష్ణుకు విజయ్ ముందే తెలుసు.. విజయ్ దేవరకొండ చదివిన డిగ్రీ కాలేజీలో విజయ్ కి సబ్ జూనియర్. ఈ విషయాన్ని విజయ్ ట్యాక్సీ వాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాడు. విష్ణు మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ట్యాక్సీవాలా సినిమాతో నటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రామన్న యూత్, మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, కీడా కోలా, హ్యాపీ ఎండింగ్, సరిపోదా శనివారం, డార్లింగ్, మా నాన్న సూపర్ హీరో వంటి ఎన్నో చిత్రాల్లో నటించాడు. అన్ని సినిమాలు మంచి హిట్నే అందుకున్న కూడా మ్యాడ్ సినిమాతో ఇతని రేంజ్ పూర్తిగా మారిపోయింది.. మ్యాడ్ సినిమాకు బెస్ట్ కమెడియన్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు.

ఇకపోతే విష్ణు నటుడు మాత్రమే కాదు.. ఫోటో గ్రఫీ కూడా చేస్తాడు. తన సోషల్ మీడియాలో తను తీసిన ఫోటోలు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాడు. డిగ్రీ చదువుతున్నప్పటి నంచి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ తో తన జర్నీ ని మొదలుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ కమెడియన్ అయ్యాడు. ఇకముందు ఎలాంటి ప్రాజెక్టులలో నటిస్తాడు చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×