E-Paper
Advertisement

సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు!

సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు!
Advertisement

Suryapet Crime: సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. భూ వివాదం కారణంగా ఓ వ్యక్తి తన సొంత అక్కను కత్తితో పొడిచి హత్య చేశాడు. స్వగ్రామానికి చెందిన సురిగి సైదులు తన అక్క సురిగి అంజమ్మ (50)పై ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్తుండగా దారిలో కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదులుకు తల్లి తన కూతురికి రెండు ఎకరాల భూమి రాసివ్వడంతో కొంతకాలంగా ఆ భూమి తనకే చెందాలని సైదులు అక్క, చెల్లెలిపై తరచూ దాడులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై గతంలో పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ కూడా జరిగింది. అయినప్పటికీ కక్ష పెంచుకున్న సైదులు ఈ హత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

ఈ ఘటనలో సైదులుతో పాటు అతని భార్య, బావమరుదులు, తమ్ముడికి కూడా సంబంధం ఉందని, వారందరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Also Read: శెట్టిపల్లి ప్రజలకు గుడ్ న్యూస్.. జగన్ అరాచకాలపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×