BigTV English

Telangana Students Dead in US: అమెరికాలో ఘోరం.. ఇద్దరు తెలంగాణ స్టూడెంట్స్ మృతి..!

Telangana Students Dead in US: అమెరికాలో ఘోరం.. ఇద్దరు తెలంగాణ స్టూడెంట్స్ మృతి..!

2 Telangana Students Dead in America: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన ఇద్దరు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.


ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కి చెందిన 19 ఏళ్ల గౌతమ్ కుమార్, కరీంనగర్‌కు అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. వీకెండ్ సెలవు కావడంతో స్నేహితులతో కలిసి వీరిద్దరు కారులో వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో గౌతమ్, నివేశ్ అక్కడికక్కడే చనిపోయారు. ఘటన సమయంలో వీరిద్దరు కారులోని వెనుక సీటులో ఉన్నారు. గాయపడిన మరో విద్యార్థులు స్థానికంగా ఓ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనపై ఆరిజోనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

గౌతమ్‌కుమార్ ఇండియా రావడానికి వచ్చేనెల 22న టికెట్ బుక్ చేసుకున్నాడు. మరో నెలరోజులైతే సొంతూరు రావాల్సివుంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. గౌతమ్ సొంతూరు స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన బంగారం వ్యాపారి కమల్ కుమార్, పద్మ దంపతుల పెద్ద కొడుకు.


Also Read: ఇజ్రాయెల్ సైనికులపై అమెరికా ఆంక్షలు.. ‘ఇదో పిచ్చి చర్య’

మరో స్టూడెంట్ నివేశ్ సొంతపూరు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం. డాక్టర్ స్వాతి, నవీన్ దంపతుల పెద్ద కొడుకు నివేశ్. ఇతడు కూడా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. భవిష్యత్‌కు బాటలు వేసుకుని విదేశాల నుంచి ఇండియా వస్తాడనుకుంటున్న సమయంలో యాక్సిడెంట్ రూపంలో ఇద్దరు స్టూడెంట్స్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×