Maharashtra: మహరాష్ట్రలో దారుణం జరిగింది. కోటి రూపాయల ఇన్సూరెన్స్ మనీ కోసం ఇంటి యజమానిని ఆయన భార్య, కొడుకు ప్లాన్ చేసి చంపేశారు. హత్యని యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీరికి మరొక వ్యక్తి సాయపడ్డారు. చివరకు ఈ ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్లొద్దాం.
ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపే పిల్లలను చూశాము. కోటి రూపాయల ఇన్యూరెన్స మనీ కోసం భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది ఆ ఇల్లాలు. ఆమెకు కొడుకు కూడా తోడయ్యాడు. డబ్బు మహా చెడ్డది అంటారు. బహుశా ఇదేనేమో. చివరకు భర్తను చంపిన ఆ ఇల్లాలు కటకటాల పాలైంది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఊహించని ఘటన జరిగింది.
అసలేం జరిగింది?
అప్పుల ఊబిలో కూరుకుపోయాడు 56 ఏళ్ల రైతు బాబూరావు పాటిల్. దీన్ని నుంచి గట్టెక్కడానికి ఒక్కటే మార్గమని భావించాడు. కాకపోతే పేరిట ఇన్యూరెన్స్ ఉంది. దాని విలువ అక్షరాల కోటి రూపాయలు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భార్య, కొడుకు సలహా ఇచ్చారు. ఆపై ఒత్తిడి తెచ్చారు. రోజురోజుకూ కుటుంబసభ్యుల నుంచి పెద్దాయనకు టార్చర్ తీవ్రమైంది.
ఈ వ్యవహారంపై ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరాయి. చివరకు భార్య, కొడుకు, వీరికి సహకరించిన మరొక పెద్దాయనను చంపేశారు. ఇక్కడ వరకు భార్య, కొడుకు చేసిన ప్లాన్ ప్రకారమే జరిగింది. అసలు కథ ఇక్కడే మొదలైంది. బాబారావు భార్య వనిత, కొడుకు తేజస్ వాంగ్మూలాలు పోలీసులకు ఇచ్చారు. అయితే ఇద్దరి మాటల్లో తేడాలు గుర్తించారు. వారిపై అనుమానాలు పోలీసులకు పెరిగాయి.
ALSO READ: తస్మాత్ జాగ్రత్త.. కొత్త కొత్త విధానాల్లో చోరీలు
కాకపోతే వారిని ఎలా పట్టుకోవాలన్నది సవాల్‌గా మారింది. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ తాము కరాడ్‌లో ఉన్నామని తల్లీ-కొడుకులు చెప్పారని వివరించారు. హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్నట్టు టెలిఫోన్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయని తెలిపారు. చివరకు తనదైన శైలిలో విచారణ చేపట్టారు పోలీసులు.
అసలు నిజం బయటపడింది. బాబురావు భార్య, కొడుకు, వీరికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 1న సాంగ్లీలో అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఇంతకీ భర్తను భార్య, కొడుకు ఎందుకు హత్య చేశారు అనేది పూసగుచ్చి మరీ వివరించారు. బాబూరావుకు ఇంటి రుణంతోపాటు రూ.50 లక్షల అప్పులు ఉన్నాయి.
అప్పు ఇచ్చినవారు ఆ కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టారు. బ్యాంకు వేలం నోటీసు జారీ చేసింది. చివరకు బీమా డబ్బుల కోసం భార్య వనిత, కొడుకు తేజస్ ఒత్తిడి తెచ్చి చంపేశారని పోలీసులు తెలిపారు. ఇక బాబూరావు పేరిట కోటి రూపాయల నాలుగు బీమా పాలసీలు ఉన్నాయి. దాని కోసమే చంపేశారు.
ఎలా చంపారు?
హైవేపై ఆత్మహత్య చేసుకోవాలని బాబురావు ప్రయత్నం చేశాడు. కానీ జరగలేదు. దీంతో విసుగు చెందిన తేజస్,కారుతో వెంబడించి చంపాలను కున్నారు. అందుకు బాబూరావు ససేమిరా అన్నారు. చివరకు పెద్దాయనను తలను బలవంతంగా రోడ్డు డివైడర్‌కి కొట్టి చంపేశారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేసి ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు ఓ నేషనల్ డైలీ న్యూస్ పేపర్ రాసుకొచ్చింది.
అయితే ఘటన ప్రాంతంలో వనిత లేదు. మొత్తానికి ముగ్గురికిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. పాపిస్టు సొమ్ము మహా చెడ్డది. ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. ఇంటి యజమానిని చంపేశారు. ఫలితం జైలుకి వెళ్లారు.