Sabdham Movie.. కోలీవుడ్ స్టార్ హీరో ఆది పినిశెట్టి(Adi PiniShetty).. ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు అన్ని భాషల్లో నటించి ,మంచి పేరు సొంతం చేసుకున్నారు.ఇకపోతే వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన, కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ‘శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా ఉండగా.. అరివళగన్ దర్శకత్వంలో, తమన్ సంగీత సారధ్యంలో దాదాపు 14 ఏళ్ల క్రితం వచ్చిన ‘వైశాలి’ సినిమా అందరూ చూసే ఉంటారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబో కలసి శబ్దం (Sabdham)అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వైశాలి మూవీలో నీటిని బేస్ చేసుకుని కథ రాస్తే.. ఇక్కడ సౌండ్ ను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఇకపోతే ఈ సినిమా చూసిన చాలా మంది ఇందులో చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యిందని, అందుకే పెద్దగా కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. కానీ బ్రిలియంట్ టెక్నికల్ అంశాలతో కథను చెప్పేందుకు డైరెక్టర్ ప్రయత్నించిన తీరు బాగున్నప్పటికీ, కథలోని అంశాలను సరళీకృతం చేయడంలో డైరెక్టర్ కాస్త వెనకబడ్డారనే ఫీలింగ్ కలుగుతోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ను మెప్పించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు అనడంలో సందేహం లేదు.
The Paradise Glimpse : కడుపు మండిన కాకుల కథ… పచ్చి బూతులతో నాని మూవీ గ్లింప్స్..!
ముఖ్యంగా ఈ మూవీకి తమన్ ఇచ్చిన సౌండింగ్, ఆర్ఆర్ చాలా అద్భుతంగా ఉందని , అయితే ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లలోనే ఎక్స్పీరియన్స్ చేయాలని, సినిమా చూసిన ఆడియన్స్ కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ శబ్దం సినిమా చూసిన మంచు మనోజ్ (Manchu Manoj) కూడా తాజాగా తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. “రీసెంట్ గా శబ్దం సినిమా చూశాను. స్టోరీ చాలా అద్భుతంగా ఉంద. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది . ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కూడా రాలేదు. ఆది చాలా అద్భుతంగా నటించారు. ఇక తమన్ అయితే అదరగొట్టేశారు. డైరెక్టర్ కి శుభాకాంక్షలు. అలాగే చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ .అయితే మీరు కూడా తప్పకుండా థియేటర్లలోనే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేయండి అంటూ మనోజ్ తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తానికైతే ఆది పినిశెట్టి సినిమాని చూసిన మనోజ్ తన అభిప్రాయాన్ని చెప్పి ఒక రకంగా సినిమాను తన వంతుగా ప్రమోట్ చేశారని తెలుస్తోంది.
ఆది పినిశెట్టి కెరియర్..
ఆది పినిశెట్టిగా పరిచయమైన ఈయన అసలు పేరు సాయి ప్రదీప్ పినిశెట్టి. తెలుగు , తమిళ్ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈయన ఎవరో కాదు దర్శకుడు, రచయిత అయిన రవిరాజా పినిశెట్టి (RaviRaja Pinishetty) కుమారుడే ఈయన. ఈయనకు సైమా అవార్డుతో పాటు నంది పురస్కారం కూడా లభించింది. రెండుసార్లు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలకి కూడా నామినేట్ కాబడ్డారు. ఇక 2006లో వచ్చిన ‘ వి’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది, 2009లో శంకర్ నిర్మించిన చిత్రం ‘ఈరం’ ద్వారా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక అంతే కాదు పలు తెలుగు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇక రంగస్థలం సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఆది ఇప్పుడు శబ్దం సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Watched #Shabdam last night, and it was an incredibly scary and thrilling experience, something I haven’t felt in a long time! ❤️🔥
My dearest friend @AadhiOfficial delivers yet another fantastic performance on the big screen. 🤗@MusicThaman nanba …. Superrr score ! 🔥… pic.twitter.com/12X7SCN4Da
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 2, 2025