E-Paper
Advertisement

Chhattisgarh Crime: మొబైల్ నెంబర్ బ్లాక్.. రగిలిపోయిన ప్రియురాలు, ఏం చేసిందో తెలుసా?

Chhattisgarh Crime: మొబైల్ నెంబర్ బ్లాక్.. రగిలిపోయిన ప్రియురాలు, ఏం చేసిందో తెలుసా?
Advertisement

Chhattisgarh Crime: వారిద్దరు ప్రేమించారు.. మరి ఏం జరిగిందో తెలీదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఎడముఖం పెడ ముఖంగా ఉంటూ వచ్చారు. ప్రియురాలు ఎవరితో రిలేషన్ ఉందో తెలుసుకునేందుకు ఆమె ఫోన్ నెంబర్‌ని బ్లాక్ చేశాడు. ఈ విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు ప్రియుడ్ని లేపేసింది. సంచలనం రేపిన ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో వెలుగుచూసింది.

ఛత్తీస్‌ఘడ్‌లో దారుణం.. ప్రియుడ్ని చంపేసిన ప్రియురాలు

Advertisement

ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌లో ఊహించని దారుణం జరిగింది. ఫోన్ నెంబర్‌ని బ్లాక్ చేశాడన్న కారణంతో ప్రియుడ్ని లేపేసింది ప్రియురాలు. బిలాస్‌పూర్ సివిల్‌ లైన్స్‌ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 25 ఏళ్ల ప్రసాద్‌ సూర్యవంశీ అనే యువకుడు స్థానిక శుభమ్‌ విహార్‌ టీచర్స్‌ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. స్టార్ హోటల్ లో పని చేస్తుంటాడు. అతడికి రోష్ని సూర్యవంశీ అనే యువతితో కొంతకాలం కిందట పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో ఒకరి దగ్గరకు మరొకరు వచ్చి వెళ్తుండేవారు. ఇక సోషల్ మీడియా, వాట్సాప్‌ల్లో ఛాటింగ్ ల్లో నిమగ్నమయ్యేవారు. క్షణ తీరిక దొరికితే చాలు.. ఫ్యూచర్ ఫ్లాన్ ఏంటంటూ చర్చించుకునేవారు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు రావడం సహజం, వీరిద్దరి మధ్య అదే జరిగింది.

Advertisement

మొబైల్ నెంబర్ బ్లాక్ చేయడమే హత్యకు కారణం

ఆ తర్వాత ఎడముఖ.. పెడముఖంగా వ్యవహరించారు. ఇదే క్రమంలో ప్రసాద్‌.. తన ప్రియురాలి ఫోన్‌ నెంబర్ బ్లాక్‌ చేశాడు. ఉన్నట్లుండి ఫోన్ బ్లాక్ కావడంతో యువతి షాకైంది. నేరుగా ప్రియుడి ఉన్న రూమ్‌కి వెళ్లింది. తన ఫోన్‌ నెంబరు ఎందుకు బ్లాక్‌ చేశావంటూ ప్రియుడితో వాదనకు దిగింది.

అంతేకాదు మొబైల్‌లో ఛాటింగ్స్‌ చూపించాలని పట్టుబట్టింది. అందుకు ప్రసాద్ ససేమిరా అన్నాడు. అప్పటికే కోపానికి గురైన ఆ యువతి, తన వెంట తెచ్చుకొన్న కత్తితో ప్రియుడిపై విచక్షణ రహితంగా దాడి చేసింది. అప్పుడుగానీ యువతి కోపం తగ్గలేదు. తీవ్రగాయాలతో పాలైన ప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

ALSO READ: భార్య అందమే భర్త కొంపముంచింది.. చివరకు ఏం చేశాడంటే?

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితురాల్ని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రసాద్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన వెనుక ఏం జరిగిందో మొత్తం విషయాలను బయటపెట్టింది. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బిలాస్‌పూర్‌ ఎస్పీ తెలిపారు. రోష్ని సూర్యవంశీ సీపట్ ప్రాంతానికి చెందిన యువతి. బిలాస్‌పూర్‌లోని కుడుదంద్ ప్రాంతంలో అద్దెకు ఉంటోంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×