Peddapalli Crime News: వారిద్దరు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్‌గా మారింది. చివరకు మనసులు సైతం కలిశాయి. కాకపోతే ఒక్కటే చిక్కు ఏర్పడింది. ఇద్దరి కులాలు వేరు. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని రకరకాల ఆలోచనలు వేసుకున్నారు. ఈ విషయం అమ్మాయి ఫ్యామిలీకి తెలిసింది. కరెక్టుగా ఆ యువకుడి పుట్టినరోజు గొడ్డలితో దారుణంగా చంపేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
సాయి స్టోరీ ఏంటి?
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి 17 ఏళ్ల సాయికుమార్ గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. పూరెల్ల పరశురాములు-జ్యోత్స్న దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు సాయికుమార్ కాగా మరొకరు అమ్మాయి. రీసెంట్‌గా డెంగీతో కూతురు చనిపోయింది. ఇక సాయికి చదువు ఏ మాత్రం అబ్బలేదు. చివరకు స్కూల్ మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువతీతో ప్రేమలో పడ్డాడు.
ఇద్దరు డీప్‌గా వెళ్లిపోయారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. స్టోరీ ఇంతవరకు యువతీ యువకులు అనుకున్నట్లుగానే జరిగింది. కూతురు ప్రేమ విషయం తండ్రికి తెలిసింది. పగతో రగిలిపోయాడు. ఇద్దరు కులాలు వేరు కావడంతో అడ్డు చెప్పాడు అమ్మాయి తండ్రి. కూతురితో మాట్లాడవద్దని తొలుత సాయికి వార్నింగ్ ఇచ్చాడు. అవేమీ పట్టించుకోలేదు.
రోజురోజుకూ వీరి వ్యవహారం శృతి మించుతోంది. ఏం చెయ్యాలా అనేదానిపై పలు రకాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. పుట్టినరోజు సాయికుమార్‌ను దారుణంగా హత్య చేశాడు అమ్మాయి తండ్రి. దీంతో చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా హత్యకు గురికావడంతో పరశురాములు-జ్యోత్స్న దంపతులు షాకయ్యారు. ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: భార్యను చంపి శరీరాన్ని ముక్కలు చేశాడు.. సూట్‌కేసులో అత్తమామలకు ఫోన్, ఆపై చిక్కాడు
ఆసుపత్రిలోని మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మాయి తండ్రి పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు సాయికుమార్. ఫంక్షన్ తర్వాత బయట ముగ్గురు వ్యక్తులు కూర్చున్నట్లు తెలిపాడు.
ఈలోగా ఓ వ్యక్తి టూవీలర్ పై వచ్చి గొడ్డలి తీసుకుని సాయికుమార్ మెడపై కత్తితో నరికాడు. ఆ సమయంలో పక్కనేవున్న తనతోపాటు మరొకరు టెన్షన్ పడ్డామని చెప్పాడు. వెంటనే సాయికుమార్ అక్కడి నుంచి పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. బైక్ వచ్చిన ఆయన వెంటబడి మరీ సాయిని చంపేశాడు. తాము వెళ్లేసరికి సాయిని చనిపోయాడు. సాయికుమార్ రెండేళ్లు ప్రేమలో ఉన్నట్లు చెప్పాడు.
ప్లాన్ ప్రకారమే కొడుకు హత్య
తన కొడుకును చంపాలని గడిచిన ఐదు నెలలుగా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు సాయికుమార్ తండ్రి. ఈ ఘటనపై గతేడాది ఆగష్టులో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ప్లాన్ ప్రకారం తన కొడుకుని హత్య చేశారని ఆరోపించారు. ఆనాడు పోలీసులు చర్య తీసుకుంటే ఇంతవరకు వచ్చేది కాదంటూ కన్నీరుమున్నీరు అవుతున్నాడు పరశురాములు. సాయి ఆత్మకు శాంతి చేకూరేలా న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు.