BigTV English

Bangalore Crime: భార్యను చంపి ముక్కలు చేశాడు.. ఆపై సూట్‌కేసులో ప్యాకింగ్, అత్తమామలకు ఫోన్

Bangalore Crime: భార్యను చంపి ముక్కలు చేశాడు.. ఆపై సూట్‌కేసులో ప్యాకింగ్, అత్తమామలకు ఫోన్

Bangalore Crime: భార్యాభర్తల మధ్య ఎన్ని రోజులుగా  గొడవలు జరుగుతున్నాయో తెలీదు. కాకపోతే ఆ గొడవలు తారాస్థాయికి చేరాయి..  ఆ తర్వాత కొట్టుకున్నారు. పట్టరాని కోపంతో భార్యను కత్తితో పొడిచాడు భర్త. ఆ తర్వాత ఆమె గొంతుకోశాడు. ఆమెని ముక్కలు ముక్కలుగా కోసి సూట్‌కేస్‌లో ప్యాక్ చేశాడు. ఆ సూట్ కేసును బాత్‌రూంలో పెట్టి అక్కడి నుంచి అత్తమామలకు ఫోన్ చేసి చెప్పాడు. అక్కడి నుంచి పూణెకు పారిపోయాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. సంచలనం రేపిన ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది.


మహారాష్ట్ర జంట

మహారాష్ట్రకు చెందిన 35 ఏళ్ల రాకేష్-గౌరీ సంబేకర్ భార్యాభర్తలు. వీరి సొంతూరు మహారాష్ట్ర కాగా, ఉద్యోగం నిమిత్తం బెంగుళూరులో ఉంటున్నారు. రెండేళ్ల కిందట వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బెంగుళూరులో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. రాకేష్ హిటాచీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. భార్య గౌరీ అనిల్ సంబేకర్ మాస్ మీడియా- కమ్యూనికేషన్ విభాగంలో కొన్నాళ్లు పని చేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. బెంగుళూరులోని దొడ్డ కమ్మనహళ్లిలో ఓ ఇంటికి కొన్ని నెలల కిందట వెళ్లారు.


పోలీసుల సమాచారం మేరకు.. రాకేష్- గౌరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రయితే ఇరువురు మధ్య తగాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 26న భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టరాని కోపంతో రాకేష్ అందుబాటులో ఉన్న కత్తి తీసుకుని గౌరి కడుపులో పొడిచాడు. అప్పటికీ ఆయన ఆవేశం తగ్గలేదు. చివరకు భార్య గొంతు కోసేశాడు. అప్పటికి గౌరి చనిపోయింది. భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఆ తర్వాత సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి బాత్‌రూంలో పెట్టాడు.

అత్తమామలకు ఫోన్ చేసి

ఆ తర్వాత గౌరి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు అల్లుడు రాకేష్. తాను ఆఫీసుకు వెళ్లి వచ్చేసరికి గౌరి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తప్పుడు సమాచారం ఇచ్చాడు. కూతురు మరణ వార్త విని షాక్‌కు గురయ్యారు గౌరి తల్లిదండ్రులు. వెంటనే మహారాష్ట్ర పోలీసులకు ఈ ఘటన గురించి ఫిర్యాదు చేశారు. వారి సమాచారం మేరకు బెంగళూరులోని హులిమావు పోలీసులు ఆ జంట ఇంటికి వెళ్లి పరిశీలించారు.

ALSO READ: ALSO READ: పెరుగు అన్నం తిని, ముగ్గురు పిల్లలు మృతి, ఆ ఇంట్లో రాత్రి ఏం జరిగింది?

పోలీసులు ఇంట్లో తనిఖీలు చేశారు. చివరకు బాత్రూంలో సూట్‌కేస్‌లో ఉంది. దాన్ని ఓపెన్ చేసేసరికి గౌరీ మృతదేహం కనిపించింది. అత్తమామలకు ఫోన్ తర్వాత నిందితుడు, భర్త రాకేష్ పూణెకు పారిపోయాడు. నిందితుడి ఫోన్ కాల్‌ను ట్రాక్ చేశారు. సతారాలోని పర్గావ్ ఖండాలా ప్రాంతంలో కారులో రాకేష్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. రాకేష్ విషం తీసుకున్నట్లు తేలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.

ఆసుపత్రిలో నిందితుడు

నిందితుడు స్పృహలోకి వస్తే ఏం జరిగిందో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు గౌరి తల్లిదండ్రులు బెంగుళూరుకి వచ్చారు. పోస్టుమార్టం తర్వాత కూతురు డెడ్ బాడీని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. కూతురు డెడ్ బాడీని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు పేరెంట్స్. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.

 

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×