Rohith Sharma : టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను క్రీజులో ఉంటే దాదాపు పరుగుల మోత మోగాల్సిందే. అయితే ప్రస్తుతం 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాడు రోహిత్ శర్మ. ఇటీవలే బెంగళూరు నిర్వహించిన బ్రాంకో టెస్ట్ కి హాజరై సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కొంత కాలంగా జిమ్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోహిత్ శర్మ 10కిలోల వెయిట్ తగ్గారంటూ తాజాగా భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఎస్ఎంలో షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఫిట్ నెస్ లేదు. ఈ వయస్సులో క్రికెట్ ఆడటం కష్టమే అంటూ విమర్శించిన వారి నోళ్లు మూయించారు అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
Also Read : Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మరోసారి రుజువైంది..చేతులారా వచ్చిన రనౌట్ వదిలేశారుగా
మరోవైపు టార్గెట్ 2027 వరల్డ్ కప్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే రోహిత్ శర్మ రిటైర్మెంట్ అవుతాడని సోషల్ మీడియాలో కొందరూ రూమర్స్ కూడా క్రియేట్ చేశారు. కానీ రోహిత్ శర్మ లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా వన్డ కెప్టెన్ రోహిత్ వర్మ అక్టోబర్ లో ఆస్ట్రేలియా పర్యటనలో తిరిగి వన్డే క్రికెట్ లోకి అడుగుపెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ కమ్ బ్యాక్ కి ముందే రోహిత్ శర్మ తన అభిమానులను ఆశ్చర్యపరిచేవిధంగా 10 కిలోల బరువు తగ్గించుకొని సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఈ అద్భుతమైన మార్పును అతని సన్నిహితుడు.. మాజీ భారత బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ చివరి సారిగా ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ తరపున ఆడాడు. ఆ తరువాత విశ్రాంతి తీసుకున్న అతను.. వచ్చేనెల అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డే సిరీస్ తో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టనున్నాడు.
ఈ సిరీస్ కోసం అతను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఐపీఎల్ 2025 సీజన్‌లో చివరిసారిగా మైదానంలో కనిపించిన 37 ఏళ్ల రోహిత్.. మొదటగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆస్ట్రేలియా A తో జరిగే మూడు 50 ఓవర్ల మ్యాచ్‌లలో ఇండియా A తరపున ఆడతాడని వార్తలు వచ్చాయి. కోహ్లీతో కలిసి ఈ మ్యాచ్‌లలో పాల్గొని ఆస్ట్రేలియాతో జరిగే ప్రధాన వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతాడని అంతా భావించారు. కానీ వీరిద్దరూ భారత్ ఏ జట్టులో చోటు దక్కించుకోలేదు. గత ఏడాది జూన్‌లో బార్బడోస్‌లో భారత్ టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీ టీ20ల నుండి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఐదు రోజుల్లోనే టెస్ట్ క్రికెట్ నుండి కూడా రిటైర్ అయ్యారు. 2027 ప్రపంచ కప్ వరకు తమ కెరీర్‌ను కొనసాగించాలనుకుంటే.. వన్డే క్రికెట్‌లో ఎంపికకు సంబంధించి తమను తాము నిలబెట్టుకోవడానికి దేశవాళీ క్రికెట్ ఆడాలని సెలక్టర్లు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని ఒక మీడియా నివేదిక సూచించడం విశేషం.