E-Paper
Advertisement

Suicide Crime: ప్రేమ పేరుతో నరకం.. శాడిస్ట్ లవర్‌ని​ అరెస్ట్ చేసిన పోలీసులు

Suicide Crime: ప్రేమ పేరుతో నరకం.. శాడిస్ట్ లవర్‌ని​ అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement

Suicide Crime: స్వేచ్ఛ బ్యూరో: అనుమానంతో ప్రేమించిన యువతిని మానసికంగా హింసించి ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైన యువకున్ని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్ పెక్టర్ రామకృష్ణ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పద్మారావునగర్ శ్రీనివాస్ నగర్ వాస్తవ్యుడైన కోటేశ్వరరావు కూతురు జనిమ్మ(19) ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థిని. ఇదిలా ఉండగా ముషీరాబాద్ నివాసి జగదీశ్​ (22)తో ఆమె కొన్నిరోజుల క్రితం ప్రేమలో పడింది. అయితే, కొన్నిరోజులుగా జగదీశ్ తాను ప్రేమించిన జనిమ్మపై అనుమానం పెంచుకున్నాడు. ఇతర వ్యక్తులతో మాట్లాడుతున్నావంటూ ఆమెను మానసికంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఈ క్రమంలో పలుమార్లు గొడవ పడి అసభ్యకర పదజాలంతో దూషించాడు కూడా. వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులకు చెబుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

అసభ్యకర పదజాలంతో..

ఇటువంటి పరిస్థితుల్లోనే జగదీశ్​ ఈనెల 14న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చేర్పించగా కోలుకుని 16వ తేదీన డిశ్చార్జ్​ అయ్యాడు. ఆ మరుసటి రోజే ఉదయం 8గంటల సమయంలో జనిమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. అసభ్యకర పదజాలంతో దూషించి నీ సంగతి చూస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. అదే రోజున ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న జనిమ్మ సీలింగ్ ఫ్యాన్​ కు చున్నీని కట్టి ఆ ఫోటోను జగదీశ్ స్నేహితుడైన శ్యామ్​ కు వాట్సాప్ ద్వారా పంపించింది. అది చూసి శ్యామ్​ వెంటనే జగదీశ్ తోపాటు మరికొందరికి ఆ విషయం చెప్పాడు. జగదీశ్​ అక్కడికి చేరుకునే లోపే జనిమ్మ సీలింగ్​ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తలుపులు తట్టినా లోపలి నుంచి జవాబు రాకపోవటంతో జగదీశ్ వెంటనే జనిమ్మ తల్లి వద్దకు వెళ్లి నీ కూతురు తలుపులు పెట్టుకుందని, ఎన్నిసార్లు పిలిచినా స్పందించటం లేదని చెప్పి వెళ్లిపోయాడు.

Advertisement

Also read: Sports Budget: తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి 9 కీలక ఓప్పందాలు

కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరణ

దాంతో జనిమ్మ తల్లి ఇంటికి వచ్చి ఇరుగుపొరుగు సాయంతో తలుపులు తెరిచి చూడగా జనిమ్మ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, జగదీశ్​ తన కూతురిని కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని జనిమ్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసిన పోలీసులు జగదీశ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్ ఫోన్ చేసి విశ్లేషించగా ఇన్​ స్టాగ్రాం ద్వారా జగదీశ్​, జనిమ్మ చేసిన చాటింగ్​ వివరాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో జనిమ్మ ఆత్మహత్యకు కారణమయ్యాడన్న అభియోగాలపై శుక్రవారం పోలీసులు నిందితుడైన జగదీశ్​ ను అరెస్ట్​ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.

Advertisement

Also Read: New Schemes: తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి.. మరో 9 నూతన పథకాలు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×