E-Paper
Advertisement

Zojila Avalanche: జోజిలాలో మృత్యు మంచు.. 15 వాహనాలు సమాధి.. ఏడుగురు బలి!

Zojila Avalanche: జోజిలాలో మృత్యు మంచు.. 15 వాహనాలు సమాధి.. ఏడుగురు బలి!
Advertisement

Zojila Avalanche: జమ్మూకశ్మీర్‌లోని జోజిలా పాస్ సమీపంలో తీవ్ర విషాదమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంచు తుఫాను విరుచుకుపడటంతో ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాద ధాటికి సుమారు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్టు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), భారత సైన్యం , SDRF బృందాలు రంగంలోకి దిగాయి. మంచు కింద సుమారు 15 వాహనాలు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా సహాయక బృందాలు మంచును తొలగించి, వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నాయి.

Advertisement

ఈ ప్రమాదం కారణంగా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారిపై భారీగా మంచు పేరుకుపోవడంతో వందలాది వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం నెలకొన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడే అవకాశం ఇంకా ఉన్నందున సహాయక చర్యలు సవాలుగా మారాయి.

Also Read: ఒకవైపు శాంతి.. మరోవైపు యుద్ధం.. ఇరాన్‌పై ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఇదే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×