Shivaratri: మహా శివరాత్రి పర్వదినాన 12 రాశుల జాతకులు ఎలా ఉండాలో శాస్త్రం చెప్తుందంటున్నారు పండితులు. శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో జన్మించిన వాళ్లు ఆయా రెమెడీస్ పాటిస్తే వాళ్ల జీవితంలో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందట.. అలాగే వారికి ఆర్థిక, రాజకీయ, సామాజికంగా కలిసొస్తుందట. ఇంతకీ శివరాత్రి రోజు పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ రాశిలో పుట్టిన జాతకులు మహాశివరాత్రి రోజు శివాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ బెల్లం లేదా తేనె కలిపిన గంగాజలంతో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయాలట. అభిషేక సమయంలో “ఓం నమః శివాయ” అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు.
ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు మహాశివరాత్రి రోజు ఆవు పాలు, పెరుగుతో శివలింగానికి అభిషేకం చేయాలట. అభిషేకం చేసే సమయంలో సదాశివ మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు.
మిథునంలో పుట్టిన జాతకులు మహా శివరాత్రి రోజు చెరకు రసంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలట. ఇలా చేయడం వల్ల వారింట్లో శుభాలు జరుగుతాయట. అలాగే వారి జాతకంలోని గ్రహ దోషాలు తగ్గిపోతాయట.
ఈ రాశి జాతకులు మహాశివరాత్రి రోజు శివుని ఆశీస్సులు పొందడానికి 108 విరగని బియ్యపు గింజలను నీటిలో కలిపి ఓం నమః శివాయ అంటూ జపిస్తూ శివలింగంపై సమర్పించాలట.
ఈ రాశిలో పుట్టిన వారు మహాశివరాత్రి నాడు శివునికి తేనెతో అభిషేకం చేసి ఎర్ర చందన తిలకంతో బొట్టు పెట్టాలట అలాగే రుద్రాష్టకం పారాయణ చేయడం వల్ల శుభాలు జరుగుతాయట.
ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఆ పరమ శివునికి మహా శివరాత్రి రోజు గంగాజలంతో నీటితో అభిషేకం చేయాలట. ఈ రోజు శివ చాలీసా పారాయణం చేయడం వల్లన అకాల మరణం నుంచి రక్షిస్తుందట.
ఈ రాశి జాతకులు మహాశివరాత్రి రోజు పరమశివునికి నెయ్యితో అభిషేకం చేయాలట.ఇలా చేయడం వల్ల వారికి ఆనందం, సంపద, మంచి ఆరోగ్యం లభిస్తుందట.
ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు మహాశివరాత్రి నాడు శివలింగానికి గులాబీలు కలిపిన గంగా జలంతో అభిషేకం చేయాలట. ఇలా చేయడం వల్ల వారి వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తుందట.
మహాశివరాత్రి రోజు ధనస్సు రాశి జాతకులు శివుడికి నీటిని సమర్పించి, ఆపై పసుపు ఆవాలను సమర్పించాలట. ఇలా చేయడం వల్ల ధనస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందట.
ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు మహాశివరాత్రి పర్వదినాన బిల్వ పత్రాలను శివుడికి సమర్పించాలట. అలాగే శుద్ద జలంతో లింగానికి అభిషేకం చేయాలట.
ఈ రాశి జాతకులు శివలింగానికి ఆవ నూనె లేదా పంచామృతంతో అభిషేకం చేయాలట. ఈ పరిహారం శత్రు అడ్డంకులు, భయం, వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుదట.
ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు మహా శివరాత్రి రోజు శివుడికి నెయ్యి , గంగా జలంతో అభిషేకం చేయాలి. ఓం నమః శివాయ అంటూ జపిస్తూ 108 బియ్యపు గింజలను శివలింగానికి సమర్పించాలట. పూజ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.