E-Paper
Advertisement

Ganesh Visarjan 2024 dates: మూడవ రోజు గణపతి నిమజ్జనం కోసం 4 శుభ ముహూర్తాలు.. అవేంటంటే

Ganesh Visarjan 2024 dates: మూడవ రోజు గణపతి నిమజ్జనం కోసం 4 శుభ ముహూర్తాలు.. అవేంటంటే
Advertisement

Ganesh Visarjan 2024 dates: దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్థి శనివారం ప్రారంభమైంది. ప్రతీ గల్లీ, వాడ, కాలనీలలో వినాయకుడిని ప్రతిష్టాపించి ఘనంగా పూజలు ప్రారంభించారు. గణపతికి ఇష్టమైన ప్రసాదాలు తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఈ తరుణంలో గణపతిని తమ కోరికలు తీర్చమంటూ కోరుకుంటున్నారు. అయితే గణపతి నిమర్జనానికి సంబంధించిన ప్రక్రియ రేపటితో ప్రారంభం కానుంది. గణపతిని 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు ఇలా నిమర్జనానికి భక్తులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 3 రోజుల పాటు తమ ఇళ్లలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించుకున్న వారు సెప్టెంబర్ 9వ తేదీన వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. అయితే మూడవ రోజున గణేశుడిని నిమజ్జనం చేయడానికి, నిమజ్జనం చేసే శుభ సమయం మరియు విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గణేష్ చతుర్థి రోజున మేలాలు, డీజేలు, బాజా భజంత్రీలతో గణపతి దేవుడికి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ తరుణంలోనే మూడవ రోజున గణపతిని నిమర్జనం చేయడానికి పలు చోట్ల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే మూడవ రోజున గణపతిని నిమర్జనం చేయడానికి 4 శుభ ముహూర్తాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Advertisement

మూడవ రోజు గణేష్ నిమజ్జనానికి అనుకూలమైన సమయం

సెప్టెంబర్ 9వ తేదీ గణేషుడి నిమర్జనానికి మూడవ రోజు కానుంది. మూడవ రోజున గణేష్ నిమజ్జనానికి మొదటి శుభ ముహూర్తం ఉదయం 6:03 నుండి 7:37 వరకు, రెండవ శుభ ముహూర్తం ఉదయం 9:11 నుండి 10:44 వరకు, మూడవ శుభ ముహూర్తం మధ్యాహ్నం 1:52 సాయంత్రం 7:59 వరకు మరియు నాల్గవ శుభ సమయం రాత్రి 10:52 నుండి అర్ధరాత్రి 12:18 వరకు ఉండనుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

గణేష్ నిమజ్జన విధానం

గణేష్ విగ్రహాల నిమజ్జనం కూడా పూర్తి ఆచారాలతో చేయడం అవసరం. అప్పుడే వినాయకుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. గణేషుడికి పూర్తి గౌరవం ఇస్తూ సరై విధానంలో వీడ్కోలు పలకాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం నిమజ్జనానికి వెళ్లే ముందు గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన మోదకాలు సమర్పించండి. ఆ తర్వాత విగ్రహాన్ని నిమజ్జన స్థలంలో పీఠంపై ఉంచాలి. పసుపు, కుంకుమ, అక్షత మొదలైన వాటిని సమర్పించి దీపం వెలిగించాలి. పువ్వులతో గణపతిని అందంగా అలంకరించి, హారతి ఇవ్వడంతో పూజ పూర్తవుతుంది. చివరగా పూజ సమయంలో తెలియక చేసిన తప్పులకు గణేశుడిని క్షమించమని అడగండి. తర్వాత గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణేష్ విగ్రహాన్ని పూర్తి గౌరవంతో నిమజ్జనం చేయండి. నిమజ్జనం రోజున నల్లని బట్టలు ధరించవద్దు, ఎవరినీ దూషించవద్దు, తప్పుగా ప్రవర్తించవద్దు. ఈ పద్ధతులను పాటిస్తూ పూజను నిర్వహించాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×