Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా అందరిపై సోషల్ మీడియా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా యువతలో విపరీతమైన పోటీ పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో సాధారణమైన వీడియోలు చేస్తే అస్సలు ఫేమస్ కాలేమనే ఆలోచనతో సాహసాలకు ఒడిగడుతున్నారు. కనీసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ కావాలనే ఆలోచనతో ప్రమాదకరమైన స్థలాలను ఎంచుకుని వీడియోలు చేస్తున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో రైలుకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. రైలులో విన్యాసాలు చేస్తూ ఎంతో మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ యువతి చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కనీసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఫేమస్ కావాలనే ఆలోచనతో ఇలాంటి వీడియోలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. యువతి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రైలులోని డోరుకు వేళాడుతూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇన్ స్టాగ్రాంలో అకౌంట్ ఉంటే చాలు వీడియోలు చేసి పోస్ట్ చేయడం వారికి లైక్స్, వ్యూస్, కామెంట్స్ రావాలని వినూత్న వీడియోలు చేస్తుంటారు. ఓ యువతి రీల్స్ పిచ్చిలో పడి ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. కదులుతున్న రైలులో ప్రయాణం చేస్తుంది. ఈ తరుణంలో రైలు ప్రయాణంలోనే వీడియోలు చేయాలని నిర్ణయించుకుంది.
వీడియోలు చేసే క్రమంలో రైలు డోర్ వద్ద నిల్చుని డోర్ పక్కనే ఉన్న ఇనుప రాడ్లను పట్టుకుని వేలాడుతూ వీడియోలు చేసింది. ఈ తరుణంలో ఒక్కసారిగా ఎదైనా ప్రమాదం జరిగితే ఆ యువతి పరిస్థితి ఏంటి. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియోను రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు చేయడం అవసరమా, ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని కామెంట్స్ చేస్తున్నారు. మరొకరు కామెంట్ చేస్తూ అసలు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే చాలా మార్గాలు ఉంటాయని, కానీ యువత ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడడం నిజంగా దారుణం అని అంటున్నారు. ఏది ఏమైనా యువతి చేసిన పనికి నెట్టింట విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
वायरल होने का बहुत जुनून सवार हो गया है आजकल इनलोगों को 😐
🎥: Suleta_Cute_girl_500k pic.twitter.com/wWXuESMrCr
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) September 5, 2024