BigTV English

Toli Ekadashi 2024: తొలి ఏకాదశి రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు

Toli Ekadashi 2024: తొలి ఏకాదశి రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు

Toli Ekadashi 2024: ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చెబుతుంటారు. దీనికి శయని ఏకాదశి అని కూడా అంటారు. క్షీర సాగరంలో శ్రీమహా విష్ణువు శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటాడు. నాలుగు నెలలపాటు విశ్రాంతి తీసుకుని అక్టోబర్ లేదా నవంబరు నెలలో మేల్కొంటాడు. ఈ నాలుగు నెలలను చతుర్మాసంగా చెబుతుంటారు. ఈ నుంచి రోజు నాలుగు నెలలు చతుర్మాస దీక్షలు చేపడుతుంటారు.


ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి రోజు తిరిగి వస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు కూడా అధికంగా ఉంటాయి. వర్షా కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందుకే పెద్దలు ఈ కాలంలో వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు.
ఏకాదశి రోజు చేయాల్సినవి:
ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి భాగవత పురాణం, విష్ణు సహస్రనామం చదువుతే మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఉపవాస దీక్ష తర్వాత రోజు అంటే ద్వాదశి రోజున తలంటు స్నానం ఆయరించి దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.ఏకాదశి రోజు ఆవులను పూజించాలి. ఈ రోజు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు.

ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. తొలి ఏకాదశి రోజున పేలాల పిండి కూడా తప్పకుండా తినాలని చెబుతూ ఉంటారు. పేలాలు మాతృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. ఆరోగ్య పరంగా బయట వాతావరణ మార్పుల వల్ల ఆషాడంలో శరీరం అనేక మార్పులకు గురవుతుంది. అందుకే పేలాల పిండి వర్షాకాలంలో శరీరానికి వేడిని కలగజేస్తుంది కాబట్టి దేవాలయాలల్లో కూడా పేలాలను ప్రసాదంగా పంచిపెడతారు.ఇంతటి పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరిస్తే భూమి ధానం చేసినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60 వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.


Also Read: ఏకాదశి నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం !

ఏకాదశి చేయకూడనివి:
ఏకాదశి రోజున ఉపవాసం వారు అసత్యాలు చెప్పకూడదు. ఎలాంటి ఆలోచనలు మనసులోకి రానీయకూడదు. ఈ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఉదయం స్నానం ఆచరించి శ్రీమహా విష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా తీసుకోవాలి. ఏకాధశి రోజు అన్నదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. మాంసాన్నిగానీ పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు వంటివి అస్సలు తినకూడదు. మంచంపై నిద్రించడం కూడా చేయకూడదు. ఇంట్లో అస్సలు మాంసం వండకూడదు. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మాంసాహారం జోలికి వెళ్లకూడదు.

Tags

Related News

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

God Idols: ఇంట్లో ఉంచకూడని దేవుని ఫోటోలు ఏవో తెలుసా..? ఆ తప్పు మీరు అసలు చేయకండి

Big Stories

×