BigTV English

Nirjala Ekadashi 2024: చాలా కష్టమైన ఉపవాస వ్రతం.. కానీ పాటిస్తే ధనవంతులు అవడం ఖాయం!

Nirjala Ekadashi 2024: చాలా కష్టమైన ఉపవాస వ్రతం.. కానీ పాటిస్తే ధనవంతులు అవడం ఖాయం!

Nirjala Ekadashi 2024: ప్రతి సంవత్సరం, జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ ఉపవాసం మత గ్రంథాలలో చాలా ప్రత్యేకం. మహాభారత కథలో నిర్జల ఏకాదశి వ్రతాన్ని కూడా వేదవ్యాసుడు వర్ణించాడు. ఈ వ్రతాన్ని ఆచరించరిస్తే ఏకంవగా 24 ఏకాదశుల ఫలితాలు లభిస్తాయని మహాభారతంలో లిఖించబడి ఉంది. ఈ ఏకాదశి రోజున కనీసం నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటేనే అది ఫలిస్తుందని పేర్కొన్నారు. అందువల్ల ఇది చాలా కష్టమైన ఉపవాసంగా పురాణాల్లో పరిగణించబడుతుంది. అయితే ఈ నిర్జల ఏకాదశి తేదీ, వ్రతం గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


నిర్జల ఏకాదశి ఎప్పుడు..?

జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తేదీ జూన్ 17 ఉదయం 4:45 గంటలకు నిర్జల ఏకాదశి ప్రారంభం కానుంది. తిరిగి జూన్ 18న ఉదయం 6:20 గంటలకు ఈ వ్రతం ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ప్రకారం, ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 18న జరుపుకుంటారు.


నిర్జల ఏకాదశి రోజున ఏం చేయాలి..?

నిర్జల ఏకాదశి మొత్తం 24 ఏకాదశులలో అత్యంత కష్టతరమైన ఉపవాసం. ఈ రోజంతా నీటిని కూడా తీసుకోకూడదు. కానీ ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉండి, ఉపవాసం ఉండాలని కోరుకుంటే, అతను నీటితో పాటు పండ్లను తీసుకోవచ్చని శాస్త్రం చెబుతుంది. అయితే నిర్జల ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం ఆచరించి బట్టలు ధరించి ఉపవాసం ఉండాలని దేవుడికి ప్రార్థించుకోవాలి. తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసి విష్ణుమూర్తిని అలంకరించాలి. విష్ణువుకు పండ్లు, పువ్వులు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. తర్వాత తులసి మొక్కకు పూజ చేసి నెయ్యి దీపం వెలిగించాలి.

Also Read: Surya Gochar 2024: 2 రోజుల్లో ఈ రాశుల వారి జీవితంలో మహా అద్భుతం.. మీ రాశి ఇందులో ఉందా..

అలాగే తులసి మొక్క చుట్టూ 5 లేదా 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. తర్వాత కథను చదివి హారతి ఇవ్వాలి. దీని తరువాత, రోజంతా ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామి వారిని తలుచుకుంటూ ప్రార్థించాలి. నిర్జల ఏకాదశి ఉపవాస సమయంలో రాత్రి నిద్రపోకూడదు. రాత్రి పూట విష్ణుమూర్తిని స్మరించుకుంటూ, వీలైతే భజన, కీర్తనలు కూడా చేయాలి. ఈ ఉపవాసం మరుసటి రోజు విరమించాలి. మరుసటి రోజు అనగా జూన్ 19వ తేదీ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్నానము చేసి పూజలు చేసి ముందుగా అన్నం తినాలి. అప్పుడే ఈ ఉపవాసం సంపూర్ణంగా పూర్తి చేసినట్లు అవుతుంది. ఇలా నిష్టతో విష్ణుమూర్తిని పూజించడం వలన స్వామి వారిని కరుణించి ధనవంతులను చేస్తారని భక్తులు నమ్ముతారు.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×