BigTV English

Mohan Charan Majhi Oath Ceremony: ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం.. హాజరైన మాజీ ముఖ్యమంత్రి!

Mohan Charan Majhi Oath Ceremony: ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం.. హాజరైన మాజీ ముఖ్యమంత్రి!

Mohan Charan Majhi takes Oath as first BJP Chief Minister of Odisha: ఒడిశా నూతన సీఎంగా బీజేపీ నేత మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరయ్యారు.


ముఖ్యమంత్రి మాఝీకి డిప్యూటీలుగా కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవతి పరిదా ప్రమాణం చేశారు. వీరితో పాటు పృథివీరాజ్ హరిచందన్, డాక్టర్ ముఖేష్ మహాలింగ్, బిభూతి భూషణ్ జెనా, డాక్టర్ కృష్ణ చంద్ర మోహపాత్ర కూడా మోహన్ మాఝీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన ఇతర మంత్రుల్లో సురేష్ పూజారి, రబీనారాయణ్ నాయక్, నిత్యానంద గోండ్, కృష్ణ చంద్ర పాత్ర, గణేష్ రామ్ సింగ్ ఖుంటియా, సూర్యబన్షి సూరజ్, ప్రదీప్ బాలసమంత ఉన్నారు.


Also Read: ఒడిశా కొత్త సీఎంగా మోహన్ చరణ్ మాఝీ.. ముఖ్యమంత్రి ప్రస్థానమిదే..!

ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ మాఝీ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మెగా ఈవెంట్‌కు ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, భూపేందర్ యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, జుయల్ ఓరమ్, అశ్విని వైష్ణవ్ సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.

24 ఏళ్ల పాటు ఒడిశాను పాలించిన నవీన్ పట్నాయక్‌ను మాఝీ ఈ ఉదయం కలిసి ప్రమాణ స్వీకారానికి రావల్సిందిగా ఆహ్వానించారు. మాఝీ ఆహ్వానాన్ని మన్నించిన మాజీ సీఎం.. నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×