ప్రతి వ్యక్తి ధనవంతులు కావాలనే దేవుడుని మొక్కుతూ ఉంటారు. ధనవంతుడిగా మారినందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ధనవంతులుగా మారాలంటే కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆచార్య చాణక్యుడు ధనవంతులు కావడానికి ఐదు సూత్రాలను చెప్పారు. మూడు వేల ఏళ్ల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ సూత్రాలు ఇప్పటికి అనుసరించదగ్గవే. వీటిని సందర్బోచితంగా వాడితే ధనవంతుడు కావడం సులభం అనే చెప్పుకోవాలి.
నిజాయితీగా సంపాదన
డబ్బును ఎప్పుడూ నిజాయితీగానే సంపాదించడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు ధనవంతులు అవుతారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ధనవంతులు అయినా కూడా త్వరగానే ఆ ధనం పోయే అవకాశం ఉంటుంది. తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం పాటు మీతో ఉండదు. అది ఏదో ఒక రోజు నీళ్లలా ప్రవహించి బయటికి పోతుంది. కాబట్టి నిజాయితీగా సంపాదించిన డబ్బే మీతో ఉంటుందని చాణక్యుడు చెబుతున్నాడు. ధనవంతులు కావడానికి ముందుగా దాన్ని ఎలా సంపాదించాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ ప్రణాళిక ద్వారా పనిచేస్తూ పోవాలి.
డబ్బు మీ ఆధీనంలోనే ఉండాలి
మీరు ఏది సంపాదించినా కూడా ఆ డబ్బు మీద అధికారం మీకు మాత్రమే ఉండాలని చెబుతున్నాడు చాణక్యుడు. ఇతరుల దగ్గర ఉంచిన డబ్బు ఎప్పటికీ ఉపయోగపడదు. అవసరం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీకు ఇవ్వకపోవచ్చు. దీనివల్ల మీకు పశ్చాత్తాపమే మిగులుతుంది. చాణక్యుడి ప్రకారం జీవితంలో ఎదగాలంటే ఒక వ్యక్తి తన ఇంటిని ఉపాధి అవకాశాలను డబ్బును తన ఆధీనంలోనే ఉంచుకోవాలి. జీవనోపాది దొరకని ప్రదేశాలను వదిలి వెళ్ళిపోవాలి. లేకుంటే పేదరికం త్వరగా వచ్చేస్తుంది.
పనికిరాని వాటికి డబ్బులు వెచ్చిస్తే?
చాణక్యుడు చెబుతున్న ప్రకారం డబ్బు సంపాదించిన తర్వాత దాన్ని తెలివిగా ఉపయోగించాలి. పనికిరాని వాటిపై డబ్బును ఖర్చు చేస్తే భవిష్యత్తులో పశ్చాత్తాపడవలసి వస్తుంది. కాబట్టి డబ్బును ఎప్పుడూ కూడా అది రెట్టింపు అయ్యే విధంగా పెట్టుబడి పెట్టాలి. అంతేకానీ ఊరికే ఖర్చు పెట్టడం వల్ల ఆ డబ్బు కరిగిపోవడమే తప్ప చేతిలో మిగలదు.
పొదుపే మంచి మార్గం
డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చాణక్యుడు చెబుతున్నాడు. పొదుపు చేయడం వల్ల జీవితంలో డబ్బుకు కొరత రాదని అతను వివరిస్తున్నాడు. ధనవంతులు కావాలని కోరుకునే వారు ముందుగా నేర్చుకోవాల్సినది పొదుపు చేయడం. పొదుపు చేయని వ్యక్తులు త్వరగా పేదరికం బారిన పడతారు. ఎక్కువ ఖర్చులు చేసిన వ్యక్తి త్వరగా పేదవాడు అవుతాడు.
డబ్బును జాగ్రత్తగా వాడాలి
చాణక్యుడు డబ్బును జాగ్రత్తగా వాడమని చెబుతాడు. సంపాదించిన దాంట్లో సగానికి పైగా పొదుపు చేస్తేనే అతడు త్వరగా ధనవంతుడు అవుతాడు. పదిరూపాయలు సంపాదిస్తే అయిదు రూపాయలు పొదుపు చేయడానికే ప్రయత్నించాలి. ముఖ్యంగా అప్పు చేయకుండి జీవించే వ్యక్తి ధనవంతుడిగా మారుతాడు.
Also Read: తులసి మాల అందరూ వేసుకోవచ్చా.. ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?