BigTV English

India vs Pakistan: రోహిత్ శర్మ vs రిజ్వాన్… టీమిండియా గెలిచే Percentage ఎంతంటే ?

India vs Pakistan:  రోహిత్ శర్మ vs రిజ్వాన్… టీమిండియా గెలిచే Percentage ఎంతంటే ?

India vs Pakistan:ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ చాలా హాట్ హాట్ గా ముందుకు సాగుతోంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… ఆదివారం రోజున పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య దాయాది పోరు జరగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు ఇప్పటికే దుబాయిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం…. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు టాస్ ప్రక్రియ ఉంటే… 2:30 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే… ఈ మ్యాచ్ నేపథ్యంలో… జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి.


Also Read: AUS vs ENG: ఇంగ్లండ్ భారీ స్కోర్ ..ఛాంపియన్స్ ట్రోఫీలో బెన్ డకెట్ కొత్త రికార్డు !

పాకిస్తాన్ గెలుస్తుందని కొంతమంది… లేదు టీమిండియా విక్టరీ ఖాయమని మరికొంతమంది అంటున్నారు. అయితే చాంపియన్స్ ట్రోఫీ గత లెక్కలు చూస్తే… టీమిండియా పైన పాకిస్తాన్ పై చేయి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 2017 సంవత్సరం లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో రెండుసార్లు పాకిస్తాన్ అలాగే టీమ్ మీడియా మధ్య మ్యాచ్ జరిగింది. ఫైనల్ లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ సమయంలో టీమిండియా ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయింది. దాదాపు 150 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడం జరిగింది. మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీలో… ఈ రెండు జట్లు ఐదు మ్యాచ్లు ఆడాయి. ఇందులో మూడింటిలో పాకిస్తాన్ విజయం సాధించింది. రెండు మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది.


ఇక ఆదివారం జరగబోతున్న మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తాడు. అటు పాకిస్తాన్ కు కొత్త కెప్టెన్ గా మహమ్మద్ రిజ్వాన్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళ కెప్టెన్సీ విన్నింగ్ పర్సంటేజ్ ఒకసారి పరిశీలిస్తే…. వందకు డెబ్బై శాతం రోహిత్ శర్మ.. కెప్టెన్సీలో టీమ్ ఇండియా విక్టరీ సాధించింది. పాకిస్తాన్ పైన కూడా రోహిత్ శర్మకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ వెనుకబడ్డాడు. అతనికి కెప్టెన్సీలో పాకిస్తాన్ కేవలం 61% మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల అతనికి కెప్టెన్సీ వచ్చింది కాబట్టి.. మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీ ని తక్కువ అంచనా వేయలేం. కానీ ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే మొదటి మ్యాచ్ ఓడిపోయిన పాకిస్తాన్… టీమిండియాతో మ్యాచ్ కు సిద్ధమవుతోంది. ఒకవేళ ఇందులో గనక పాకిస్తాన్ ఓడితే కచ్చితంగా టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వస్తుంది.

Also Read: India vs Pakistan: దుబాయ్ మ్యాచ్… టీమిండియాను భయపెడుతున్న లెక్కలు ?

పాకిస్థాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (C & WK), సల్మాన్ అలీ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, Mohd. షమీ

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×