BigTV English

Tulasi Mala: తులసి మాల అందరూ వేసుకోవచ్చా.. ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?

Tulasi Mala: తులసి మాల అందరూ వేసుకోవచ్చా.. ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?

తులసిమాల మెడలో వేసుకుని చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఆ మాలను ఎందుకు వేసుకుంటారు? ఎలాంటి వ్యక్తులు వేసుకోవాలో కూడా ఎంతో మందికి అవగాహన ఉండదు. వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే వ్యక్తి ఎక్కువగా తులసిమాలను ధరిస్తూ ఉంటారు. దీన్ని జపమాలలాగా జపించడానికి కూడా ఉపయోగిస్తారు. హిందూ సంప్రదాయంలో తులసి మొక్క కేవలం ఒక మొక్క మాత్రమే కాదు అది ఒక దేవత. వ్యక్తుల జీవితాల్లో శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని అందించే కల్పవల్లి.


తులసిమాలకు శ్రీకృష్ణునితో అనుబంధం ఉందని వైష్ణవులు చెప్పుకుంటారు. వైష్ణవ శాఖలో శ్రీకృష్ణుని నామాలు జపించేటప్పుడు ఈ తులసిమాలని చేత్తో పట్టుకుంటారు. కృష్ణుడిని పూజించేవారు పూజ చేసుకుంటున్నాప్పుడు తులసిమాలను ఉపయోగిస్తారు. చాలామంది కృష్ణ భక్తులు తులసిమాలను తమ భక్తికి చిహ్నంగా ధరిస్తారు.

ఎంతోమంది భక్తులు తులసి మాలను పవిత్ర ఆభరణంగా భావిస్తారు. దీన్ని అలంకార వస్తువుగా భావించకూడదు. ఆధ్యాత్మిక క్రమశిక్షణ, స్వచ్ఛత ఉన్నవారు మాత్రమే ధరించాలని చెబుతారు. ఇది శ్రీకృష్ణుడి పట్లా, విష్ణు పట్ల వారి భక్తిని చూపిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతికూల శక్తులు, అవాంతరాల నుండి ఇది వారిని రక్షిస్తుందని భావిస్తారు. మాలను వేసుకోవడం వల్ల శరీరానికి, మనస్సుకు ఎంతో ప్రశాంతతను దక్కుతుందని చెప్పుకుంటారు.


తులసిమాల మంత్రాలను జపించడానికి కూడా జపమాల ఉపయోగిస్తారు. తులసి మాలలో 108 పూసలు ఉంటాయి. అలాగే ఒక గురుపూస కూడా ఉంటుంది. ఆ గురుపూస దైవంతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. 108 అనేది హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలలో పవిత్రమైన సంఖ్.య

108 నామాలను జపించాల్సి వచ్చినప్పుడు ఇలా తులసిమాలను పట్టుకొని ఒక్కొక్క పూసలు జరుపుతూ నామాలను జపిస్తారు. అలాగే హరే కృష్ణ హరే రామ జపం చేస్తున్నప్పుడు కూడా చేతిలో తులసిమాలను పట్టుకునే వారి సంఖ్య ఎంతో ఎక్కువ.

తులసిమాలను మరింత శక్తివంతం చేయడానికి దాన్ని స్వచ్ఛంగా, పవిత్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తులసిమాలను అప్పుడప్పుడు గంగాజలం, పాలతో కడగడం వల్ల దానికి ఉన్న మలినాలు తొలగిపోతాయి. అది మరింత శక్తివంతంగా మారుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు, విష్ణు విగ్రహం ముందు ఈ తులసిమాలను ఉంచాలి. దీనివల్ల తులసిమాల ఆ దేవతల శక్తిని కూడా గ్రహిస్తుందని చెప్పుకుంటారు. తులసిమాలకు పువ్వులు, ఆకులు సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలు కూడా పఠించాలి.

తులసి మాలను వేసుకోవడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాదు, మానసికంగా అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొంతమందికి శారీరక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. శ్రీకృష్ణుడి భక్తులో మునిగిపోయిన వారికి ఇది ప్రశాంతతను అందిస్తుంది. ధ్యానం చేయడంలో మనసుకు ప్రశాంతతను ఇవ్వడంలో ఇది సహాయపడుతుంది. మీరు మాలలోని పూసలను వేళ్ళతో కదిలిస్తున్నప్పుడు మీ దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది. తులసిమాల సహజ వైద్య లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతారు. శ్వాస కోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందని అంటారు.

Also Read: సూర్యదేవుని రథానికి ఉండే ఏడు గుర్రాలు పేర్లు ఏమిటో, అవి వేటిని సూచిస్తాయో తెలుసా?

తులసి మాల ధరించే వ్యక్తి కొన్ని నియమాలను పాటించాలి. వారు ప్రకృతిలో అపవిత్రమైన పనులను చేయకూడదు. అలాగే మాంసాహారాన్ని ముట్టకూడదు. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినకూడదు. చెడు మాటలకు, తిట్లకు దూరంగా ఉండాలి. ఎవరినీ బాధ పెట్టడం వంటి పనులు చేయకూడదు. తోటి వారిపట్ల చెడుగా ప్రవర్తించడం వంటి పనులు చేయకూడదు. అబద్ధం చెప్పకూడదు. అపవిత్రమైనవిగా భావించే వాటిని చూడకూడదు.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×