Chanakyaniti: డబ్బు సంపాదించడానికి, కుటుంబ కోరికలను నెరవేర్చడానికి పగలు, రాత్రి తేడా లేకుండా పని చేస్తుంటాం. మనమందరం కష్టపడి డబ్బు సంపాదిస్తాము. అందుకే దానిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. కొన్నిసార్లు కొంతమంది మన మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మనం కష్టపడి సంపాదించిన డబ్బును దొంగిలిస్తారు.
మోసం చేసే స్వభావం ఉన్న స్నేహితులు అయినా, నకిలీ పెట్టుబడి సలహాదారులు అయినా లేదా ఆకర్షణీయమైన అవకాశాలను చూపించే వ్యక్తులు అయినా, వారు మనల్ని తప్పుదారి పట్టిస్తుంటారు. ఇలాంటి సమయంలోనే మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పొరపాటున కూడా ఇవ్వకూడని వ్యక్తుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అలా చేయడం వల్ల మీరు మీ జీవితాంతం ఇబ్బంది పడాల్సి రావచ్చు.
ద్రోహం చేసే స్నేహితులు:
అవకాశం వచ్చినప్పుడు మీకు ద్రోహం చేసే స్నేహితుల పట్ల మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అలాంటి స్నేహితులు తరచుగా మీ మంచి సంబంధాన్ని ఆసరాగా చేసుకుని మీ నుండి డబ్బు అప్పుగా అడిగి, తరువాత తిరిగి ఇవ్వకపోవచ్చు. వారు మిమ్మల్ని భావోద్వేగపరంగా బ్లాక్ మెయిల్ చేయవచ్చు. అంతే కాకుండా డబ్బు ఇవ్వమని బలవంతం చేయవచ్చు. తర్వాత సమయం వచ్చినప్పుడు మీకు డబ్బు తిరిగి ఇవ్వకుండా ఉంటారు. అలాంటి వ్యక్తులు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సరిగ్గా ఉపయోగించరు. అంతే కాకుండా మిమ్మల్ని నష్టాల్లోకి నెట్టివేస్తారు. కాబట్టి అలాంటి స్నేహితులకు డబ్బు ఇవ్వకుండా ఉండండి.
పెట్టుబడిదారులు:
కొంతమంది ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను చూపించి మీ డబ్బును కాజేస్తారు. అలాంటి వారు పెద్ద పెద్ద క్లెయిమ్‌లు చేయడం ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టమని అడుగుతారు. కానీ వాస్తవానికి వారి లక్ష్యం వారి స్వార్థం కోసమే. సరైన సమాచారం లేకుండా మీరు అలాంటి వాటిలో పెట్టు బడి పెట్టినప్పుడు, మీరు మీ డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. అందుకే పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారాన్ని పొందడం చాలా ముఖ్యం.
నకిలీ పెట్టుబడి సలహాదారులు:
మీరు కష్ట పడి సంపాదించిన డబ్బును కొంత మంది మోసగించడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఈ వ్యక్తులు మీకు స్టాక్ మార్కెట్ లేదా ఏదైనా ఇతర పెట్టు బడి పథకం గురించి తప్పుడు సమాచారం ఇచ్చి మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు.. మీరు దేనిలో పెట్టుబడి పెడుతున్నారో పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం.
Also Read: ఎడమ కన్ను అదిరితే శుభమా ? అశుభమా ?
కొంతమంది రుణదాతలు:
మీకు కొంత మంది రుణం ఇస్తామని కూడా హామీ ఇస్తారు. కానీ వారు మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో పారిపోవచ్చు. దానిని తిరిగి ఇవ్వకపోవచ్చు. అంతే కాకుండా వారు మీకు డబ్బును తిరిగి ఇస్తామని హామీ ఇవ్వవచ్చు. కానీ వారి అసలు ఉద్దేశం వేరేలా ఉంటుంది. అందుకే డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా ఎవరినీ నమ్ము డబ్బు ఈజీగా ఇవ్వకూడదు. వాళ్లు తిరిగి ఇవ్వకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.