BigTV English

War 2: తారక్ తో ఫోటో దిగే ఛాన్స్.. సూపర్ స్కెచ్ గురూ..

War 2: తారక్ తో ఫోటో దిగే ఛాన్స్.. సూపర్ స్కెచ్ గురూ..

War 2: ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఇక అందులోనూ మల్టీ స్టారర్ మూవీ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అలాంటి సినిమా కోసం అభిమానులు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ వార్ 2. టాలీవుడ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న సినిమా. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ నిమగ్నమైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మూవీ టీం ఫ్యాన్స్ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయనున్నారుట.. ఆ వివరాలు చూద్దాం..


సర్ప్రైజ్ ప్లాన్..తారక్ తో ఫోటో దిగే ఛాన్స్..

వార్ 2 ఒక స్పై, థ్రిల్లర్ మూవీ గా రానుంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందే హీరోతో అభిమానులు ఫోటో షూట్ కి ప్లాన్ చేస్తున్నారట మూవీ టీం. సినిమా థియేటర్లలో ఇంకొన్ని రోజుల్లో విడుదలవుతుంది. అనగా మూవీలో ఉన్న ఇద్దరు హీరోలతో ఫోటోషూట్ ను ప్లాన్ చేస్తున్నారు. సినిమాకి ప్రమోషన్స్ లో భాగంగా ఇలా డిఫరెంట్ ఐడియాతో మూవీ ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లే ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అదే నిజమైతే జూనియర్ ఎన్టీఆర్ తో ఫోటో దిగే ఛాన్స్.. ఫ్యాన్స్ కు కల్పించనున్నారు. ఏది ఏమైనా చిత్ర యూనిట్ సూపర్ స్కెచ్ చేశారంటున్నారు అభిమానులు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


సూపర్ స్కెచ్ ..ఆ రేంజ్ హిట్ ..

ఇక వార్ 2 తో ఇద్దరు బడా హీరోలు ఓ మల్టీస్టారర్ మూవీ తో మన ముందుకు రానున్నారు. గత సంవత్సరం ఎన్టీఆర్ దేవర మూవీతో మన ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హీట్ ను అందుకున్నారు. ఇక ప్రత్యేకంగా వీరిపై చిత్రీకరించే ఫైట్ సీన్ కోసం 40 మందితో ఓ సీక్వెల్ ని ప్లాన్ చేశారట. 15 నిమిషాల పాటు ఈ ఫైటింగ్ పార్ట్ కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు క్లైమాక్స్ ఊహించని రీతిలో భారీ యాక్షన్ సీక్వెల్ తో ఉంటుందని సమాచారం. ఇక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ డాన్సులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకే స్క్రీన్ పై సూపర్ డాన్సర్లను చూడబోతున్నాం. వార్ సినిమాకి సీక్వెల్ గా వార్ 2 రానుంది. మొదటి భాగం 500 కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డ్ సృష్టించింది ఇప్పుడు ఈ సీక్వెల్ 1000 కోట్లకు పైగా మారుకుని అందుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటుంది. ఒక పాట తప్ప మిగిలిన షూటింగ్ అంతా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ ఈ చిత్రానికి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. బ్రహ్మాస్త్రం మూవీతో విజువల్ ఎఫెక్ట్స్ లో తన ప్రతిభను చాటిన దర్శకుడు ఈ సినిమాను హాలీవుడ్ రేంజిలో చిత్రీకరించారని టాక్. ఎస్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్సిటీలో భాగంగా వస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో వార్డు ఒకటి. 2019లో విడుదలైన వార్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Good Bad Ugly : అప్పుడే ఓటీటీకి అజీత్.. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×