BigTV English

Numerology: న్యూమరాలాజీ ప్రకారం  మీకు ఏ వయసులో అదృష్టం కలిసి వస్తుందో తెలుసా..?

Numerology: న్యూమరాలాజీ ప్రకారం  మీకు ఏ వయసులో అదృష్టం కలిసి వస్తుందో తెలుసా..?

Numerology: అదృష్టం కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. మంచి ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల, రాబడిలో స్థిరత్వం వీటన్నింటికీ అదృష్టం కలిసి రావాలని వెయిట్‌ చేస్తుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. అలాగే కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా మరియు ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. అయితే అంకెను బట్టి ఏ తేదీలలో పుట్టిన వారికి అదృష్టం ఏ వయస్సులో  వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.


ఒకటో నెంబర్‌ వ్యక్తులు:

పుట్టిన తేదీలు ఒకటి, పది, పందొమ్మిది, ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వ్యక్తులు అందరూ ఒకటో నెంబర్‌ వ్యక్తులు. ఈ సంఖ్యకు అధిపతి రవి. వీళ్లు స్వయం కృషితో సంపాదిస్తారు. వీళ్లు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్లు ఉద్యోగులు, ఏజెంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, నాయకులుగా రాణిస్తారు. వీరికి 22 ఏండ్ల వయసులో అదృష్టం కలిసి వస్తుంది. ఈ వ్యక్తులు అన్నింటిలో విజయం సాధిస్తారు. అలాగే వీరికి 10, 19, 22, 37, 46, 55 ఏండ్ల వయసులో కూడా అదృష్టం కలిపి వస్తుంది. ఆయా వయసులోనే జీవితంలో అనేక మార్పులు చేసుకుని జీవితంలో స్థిరపడే అవకాశం పుల్లుగా ఉంటుంది.


రెండవ నెంబర్‌ వ్యక్తులు:

ఇక రెండు, పదకొండు, ఇరవై, ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టిన వ్యక్తులను రెండవ నెంబర్‌ వ్యక్తులగా పరగణిస్తుంది సంఖ్యాశాస్త్రం. వీళ్లు జీవితంలో ధనవంతులుగా, పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. వీళ్లు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. వీరు చాలా జాగ్రత పరులు. రచయితలు, కళాకారులు, నటులు, వ్యాపారులుగా రాణిస్తారు. వీరికి 24 ఏండ్ల వయస్సులో అదృష్టం కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. అలాగే పదకొండు, ఇరవై, ఇరవై నాలుగు, ముఫ్పై ఎనిమిది, నలభై ఏడు, యాభై ఆరు, అరవై ఐదు సంవత్సరాల వయస్సులోనూ అదృష్టం కలిసి వస్తుంది.

మూడవ నెంబర్‌ వ్యక్తులు:

ఇక 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారందరూ మూడో నెంబర్‌ వ్యక్తులుగా పరిగణిస్తారు. వీళ్లు అదృష్ట వంతులుగాఉ సమాజంలో డబ్బు, కీర్తి, కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. వీరికి 32 ఏండ్ల వయస్సులో అదృష్టం కలిసి వస్తుంది. ఆ వయసులో వాళ్లు ఎంత కష్టపడితే అంత అదృష్టం వరిస్తుంది. వీరికి 12, 21, 32, 39, 48, 57, 66 ఏండ్ల వయస్సులోనూ వీరికి అదృష్ట గడియలు వరిస్తాయి.

నాలుగవ నెంబర్‌ వ్యక్తులు:

నాలుగు, పదమూడు, ఇరవై రెండు, ముప్పై ఒకటి తేదీలలో పుట్టిన వారిని నాలుగో నెంబర్‌ వ్యక్తులుగా సంఖ్యాశాస్త్రం చెప్తుంది. వీళ్లు జీవితంలో బాగా సంపాదిస్తారు. వీరు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి 36, 42 ఏండ్ల వయస్సులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరాలలో వ్యక్తులు ప్రమోషన్లు, ద్రవ్య లాభాల్లో విజయాన్ని సాధిస్తారు. వీరికి 13, 22, 36,42, 49, 58, 67 ఏండ్లలో అదృష్టం వరిస్తుంది.

అయిదవ నెంబర్‌ వ్యక్తులు:

ఐదు, పద్నాలుగు, ఇరవై మూడు తేదీలలో పుట్టిన వారిని ఐదో నెంబర్‌ వ్యక్తులుగా పరిగణిస్తారు. వీరు తమ తెలివితేటలతో సంపాదిస్తారు. వీరు చాలా మాటకారులు అయి ఉంటారు. వీరికి మంచి సమయం 32 ఏండ్ల వయస్సులో ప్రారంభం అవుతుంది. మంచి  కీర్తి, డబ్బు ఈ వయసులోనే వస్తుంది. అలాగే 14, 23, 32, 41, 50, 54, 60 సంవత్సరాల వయసులోనూ వీరికి అదృష్టం కలిసి వస్తుంది.

ఆరవ నెంబర్‌ వ్యక్తులు:

ఇక ఆరో తేదీ, పదిహేను, ఇరవై నాలుగు తేదీలలో పుట్టిన వారంతా ఆరో నెంబర్‌ కిందకు వస్తారు. వీరు స్వయంకృషితో ఎదుగుతారు. వీళ్లకు భావోద్వేగం ఎక్కువ. వీరికి 25వ సంవత్సరంలో అదృష్టం కలిసి వస్తుంది. తమ కలలను సాధించడానికి ఈ సంవత్సరం అనువైనది. అలాగే 15, 25, 33, 42, 51, 60, 69 సంవత్సరాలలో కూడా వీరికి అదృష్టం కలిసి వస్తుంది.

ఏడవ నెంబర్‌ వ్యక్తులు:

ఏడు, పదహారు, ఇరవై ఐదు తేదీలల్లో పుట్టిన వారిని ఏడవ నెంబర్‌ వ్యక్తులు అంటారు. ఈ ఏడవ నెంబర్‌కు చెందిన వ్యక్తులకు భక్తి భావం ఎక్కువ ఉంటుంది. కళాకారులుగా ఉద్యోగులుగా రాణిస్తారు. వీరికి 38, 44 సంవత్సరాలలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆ కాలంలో కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అలాగే 16, 25, 38, 44, 52, 61, 64 ఏండ్ల వయసులో కూడా అదృష్టం కలిసి వస్తుంది.

ఎనిమిదవ నెంబర్‌ వ్యక్తులు:

ఎనిమిది, పదిహేడు, ఇరవై ఆరు తేదీలలో పుట్టిన వ్యక్తులు 8 నెంబర్‌ కిందకు వస్తారు. వీళ్లు మిగతా వాళ్ల కంటే ఆర్థికంగా బలంగా ఉంటారు. ఇంజనీర్లు, డాక్టర్లు,పోలీసులు, నటులుగా రాణిస్తారు. వీరికి 36, 42 ఏండ్ల వయస్సులో అదృష్టం కలిసి వస్తుంది. ఇంకా 17, 26, 36, 42, 53, 62, 71 ఏండ్ల  వయస్సులోనూ అదృష్టం కలిసి వస్తుంది.

తొమ్మిదవ నెంబర్‌ వ్యక్తులు:

తొమ్మిది, పద్దెనిమిది, ఇరవై ఏడు తేదీలలో పుట్టిన వారిని 9 నెంబర్‌ వ్యక్తులు అంటారు. వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు. వీరు ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేస్తారు. వ్యవసాయం, డాక్టర్లు, రాజకీయాలు బాగా కలిసి వస్తాయి. వీరికి 28 ఏండ్ల వయస్సులో అదృష్టం కలిసి వస్తుంది.  అలాగే 18, 28, 36, 45, 54, 63, 72 సంవత్సరాలలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్‌ టీవీ సొంతంగా క్రియేట్‌ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×