Aha Dance Icon S2:ఈ మధ్యకాలంలో డాన్స్ షోలు ఎంతలా దిగజారుతున్నాయి అంటే శరీరం మొత్తం చూపించేస్తూ.. అసలు సినిమాలలో చూపించే మాస్ మసాలా అంతా ఇక్కడ డాన్స్ రూపంలో చూపిస్తూ.. ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ, చిన్నపిల్లలు చూసే ఇలాంటి డాన్స్ షోలను బూతు షోలుగా మారుస్తున్నారు అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ గా పేరు సొంతం చేసుకున్న ఆహా ఓటీటీ వేదికగా ‘డాన్స్ ఐకాన్ సీజన్ 2’ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఓంకార్(Omkar ) హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) తో పాటు కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్(Yashwanth Master), ప్రముఖ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
ఛీ దీన్ని డ్యాన్స్ అంటారా?
ఇక తాజాగా ఒక్కొక్కరు ఒక్కో టీం తో వచ్చి తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఏదైనా ఒక షో అంటే ఫ్యామిలీ మొత్తం సరదాగా కాలక్షేపం చేయడానికి ఒకే చోట చేరి చూస్తారు. ఫ్యామిలీ అంటే పెద్దలు, పిల్లలతో పాటు ప్రతి ఒక్కరు చూసే ఈ షోలలో ఇప్పుడు అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువయ్యాయనే చెప్పాలి. డాన్స్ చేయమంటే డాన్స్ తప్ప శరీరంలోని అన్ని భాగాలను చూపిస్తూ షోలను కాస్త అసభ్యకరంగా మార్చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ప్రముఖ స్పెషల్ సాంగ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ముమైత్ ఖాన్ (Mumaith khan) తన టీం తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ లేడీ కంటెస్టెంట్ ఆషిక తన అందాలు చూపిస్తూ “పరేషానురా” అనే పాటకు తన డాన్స్ తో రెచ్చిపోయింది. అయితే ఇక్కడ నడుము మీద నీటిబొట్లు పడేలా.. అందాలన్నీ చూపిస్తూ ఆమె రెచ్చిపోయిన తీరుకు నెటిజెన్స్ తలలు బాదుకుంటున్నారు. ఈ డాన్స్ పర్ఫామెన్స్ చూసిన నెటిజన్స్ ఛీ ఛీ దీనిని డాన్స్ అంటారా? డాన్స్ చేయమంటే అన్ని చూపిస్తున్నారు.. మనకేంటో ఈ దరిద్రం.. పొట్టపై చినుకులు పడితే నడుం ఊపడం.. ఇదెక్కడి డ్యాన్స్ మూవ్ రా బాబు అని తలలు బాదుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
also read:Pawan Kalyan : సీజ్ ది థియేటర్స్.. తనిఖీల్లో ఇవి లేకుంటే… అంతే సంగతులు..!
డాన్స్ అంటే అన్ని చూపించడమా..?
ఇకపోతే ఇప్పుడు ఇలాంటి డాన్స్ షోలలో డాన్స్ మినహా శరీరంలోని భాగాలను చూపిస్తూ రెచ్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని అటు నెటిజన్స్ తో పాటు డాన్స్ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాన్స్ అంటే శరీరాన్ని ఒక విల్లులా వంచగలగాలి. ఆ డాన్స్ చేస్తున్నప్పుడు ప్రతి మూమెంట్లో కూడా ఒక రిథమ్ కనిపించాలి. అసభ్యత ఇసుమంతైన కనిపించకూడదు.. శరీరం స్ప్రింగ్ లా ఊగాలే తప్ప ఇప్పుడు డాన్స్ పేరుతో శరీరాన్ని చూపించుకుంటూ డాన్స్ ను బ్రష్టు పట్టిస్తున్నారు అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
?utm_source=ig_web_copy_link