Sajjala Bhargava Rreddy: వైసీపీ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డికి విచారణలో చెమటలు పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు చాలా వాటికి తెలీదు, మరిచిపోయానంటూ దాటవేత సమాధానాలు ఇస్తున్నారట. దీంతో డీటేల్స్ దగ్గర పెట్టి ఆయన్ని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
సజ్జల భార్గవ్‌రెడ్డి గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. వైసీపీలో ఆయన ఎంత చెబితే అంతే. అంతేకాదు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇన్‌ఛార్జ్ కూడా. వైసీపీ హయాంలో ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఫ్యాన్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడివారందరిపై విరుచుకుపడేది. ఆయన కేవలం ఆదేశాలు మాత్రమే ఇస్తారట. అమలు చేసేది ప్రత్యేకంగా టీమ్ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి ఆయనకు ఏలాంటి సంబంధాలు ఉండవన్నది వైసీపీ వెర్షన్.
జనసేన అధినత పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత లోకేశ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో విచారణకు హాజరయ్యారు సజ్జల భార్గవరెడ్డి. బుధవారం ఉదయం మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌కు ఆయన వచ్చారు. ఆయనతోపాటు స్టేషన్ లోపలికి ఓ వైసీపీ నేత వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. భార్గవ్ తప్పించి మిగతావారికి ఎలాంటి పర్మీషన్ లేదని పోలీసులు చెప్పారు. దీంతో భార్గవ్‌ను ఇద్దరు పోలీసులు లోపలికి తీసుకెళ్లారు.
స్టేషన్‌లో పోలీసు అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు కొద్దిసేపు సైలెంట్‌గా ఉన్నాడట సజ్జల భార్గవ్. ఈ క్రమంలో తనమైన శైలిలో అడిగే సరికి గుర్తు లేదు, తెలీదు, మరిచిపోయానంటూ సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టారట. పోస్టులు పెట్టినవారికి తనకు ఏమాత్రం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారట. విచిత్రం ఏంటంటే పోలీసులు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలంటే మధ్యాహ్నం స్టేషన్‌కు ఆయన వచ్చారు.
ALSO READ: మాకో ముక్కోడు.. మీకో తిక్కోడు, నర్సిరెడ్డి జబర్దస్త్ స్పీచ్
కూటమి నేతలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ మద్దతుదారులు మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, సజ్జల భార్గవరెడ్డికి రెండుసార్లు 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నారు.
ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు చుక్కెదురైంది. అన్నిదారులు మూసుకుపోవడంతో చివరకు విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టాలని ఎవరు ప్రొత్సహించారు? ఒకవేళ మీరు పెడితే అసభ్యకర పోస్టులు ఎలా పెట్టారు? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.