BigTV English

 Numerology: న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీకి సరిపోయే అదృష్ట సంఖ్యలేవో తెలుసా..?

 Numerology: న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీకి సరిపోయే అదృష్ట సంఖ్యలేవో తెలుసా..?

Numerology: ప్రతి మనిషికి అదృష్ట, దురదృష్ట సంఖ్యలుంటాయని న్యూమరాలజీ చెప్తుంది. అదృష్ట సంఖ్యలేవో తెలుసుకుని మీరు చేసే పనులు కానీ ప్రాజెక్టులు కానీ మొదలు పెడితే మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతాయి. అలా కాకుండా మీకు తెలియకుండానే మీరు మీ దురదృష్ట సంఖ్యల్లో ఏవైనా పనులు కానీ ప్రాజెక్టులు కానీ మొదలు పెడితే మీకు నష్టం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ పుట్టిన తేదీకి సరిపోయే అదృష్ట సంఖ్యలు ఏవో తెలుసుకోవాలి. ఆ సంఖ్యలు  ఉన్న తేదీలలో మీ పనులు ప్రారంభిస్తే మీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ లాభాల బాటలో నడుస్తాయని న్యూమరాలజీ నిపుణులు చెప్తుంటారు.


అయితే ఇందుకోసం  ముందుగా మీరు మీ డెస్టినీ నెంబర్‌ తెలుసుకోవాలి. ఆలా వచ్చిన డెస్టినీ నెంబర్‌ ద్వారానే మీమీ అదృష్ట సంఖ్యలను తెలుసుకోగలరు. డెస్టినీ నెంబర్‌ తెలుసుకోవాలంటే.. మీరు పుట్టిన సంవత్సరం, నెల, తేదీ మొత్తం ప్లస్‌ చేయగా వచ్చే ఏక సంఖ్యనే మీ డెస్టినీ నెంబర్‌ అవుతుంది.  ఉదాహరణకు మీరు 1-12-1984 లో పుట్టినట్లయితే.. 1+12+1984=1997 వస్తుంది. ఇప్పుడు మళ్లీ 1997ను మొత్తం కూడగా.. 1+9+9+7=26 వస్తుంది. మళ్లీ దీన్ని మొత్తం ప్లస్‌ చేస్తే..  2+6=8 వస్తుంది ఈ 8 నెంబరే మీ బర్తు లేదా డెస్టిని  నెంబర్‌ అవుతుంది. ఇలా ఒకటి నుంచి తొమ్మిది వరకు వచ్చే నెంబర్ల ప్రకారం మీ  అదృష్ణ సంఖ్యలేంటో  ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకటవ నెంబర్‌: ఒకటో నెంబర్‌ వాళ్లకు అదృష్ట సంఖ్యలు నాలుగు, పది,  పదమూడు, ఇరవై రెండు, ఇరవై ఎనిమిది, ముఫ్పై ఒకటి. ఈ నెంబర్లు కానీ తేదీలు కానీ మీకు కలిసి వస్తాయి. అలాగే లాటరీ టికెట్లు కొనాలనుకున్నా..? గుర్రపు పందేలు ఆడాలనుకున్నా  ఒకటి, నాలుగు, ఐదు, ఏడు నెంబర్ల పై ఆడాలని సూచిస్తున్నారు.


రెండవ నెంబర్‌:  ఈ నెంబర్‌ జాతకులకు ఒకటి, ఏడు, పదహారు, ఇరవై, ఇరవై ఐదు అదృష్ట నెంబర్లు. ఈ నెంబర్లలో మీరేం చేసిని కలిసి వస్తుందట. ఇక ఒకటి, ఐదు, ఆరు, ఎనిమిది నెంబర్లు లాటరీ టికెట్లలో కానీ గుర్రపు పందెలు ఆడే టైంలో కానీ ఉండేలా చూసుకోవాలట.

మూడవ నెంబర్‌: ఈ నెంబర్‌ గల వ్యక్తులకు కలిసిరావాలంటే మూడు, ఆరు, పద్దెనిమిది, ముఫ్పై ఒకటి నెంబర్లు లేదా తేదీలలో పనులు చేసుకోవాలని చెప్తున్నారు. ఇక మూడు, ఆరు, ఏడు, తొమ్మిది నెంబర్లు గల లాటరీ టికెట్లు కానీ గుర్రపు పందాలు కానీ ఆడితే కలిసి వస్తుందట.

నాలుగవ నెంబర్‌: నాలుగో నెంబర్‌ జాతకులకు ఈదృష్టాన్ని ఇచ్చే సంఖ్యలు ఒకటి, నాలుగు,  పది, పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవై రెండు ఈ నెంబర్లు లేదా తేదీలు మీకు బాగా కలిసి వస్తాయట. ఇక ఒకటి, నాలుగు, ఏడు, ఎనిమిది నెంబర్లు లాటరీ టికెట్లలో లేదా గుర్రపు పందాలలో ఉంటే మీకు బాగా కలిసి వస్తుందట.

ఐదవ నెంబర్‌: ఈ నెంబర్‌ వ్యక్తులకు ఐదు, ఏడు, తొమ్మిది, పద్నాలుగు, ఇరవై మూడు, ఇరవై ఏడు సంఖ్యలు బాగా కలిసి వస్తాయట. లాటరీ టికెట్లు కొన్నప్పుడు రెండు అయిదు, ఏడు, తొమ్మిది నెంబర్లు ఉండేలా చూసుకుంటే మీకు లాటరీ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

ఆరవ నెంబర్‌: ఆరవ నెంబర్‌ వ్యక్తులకు అదృష్టాన్ని ఇచ్చే నెంబర్లు మూడు, ఆరు, తొమ్మిది, పదిహేను, ఇరవై నాలుగు, ముప్పై. ఈ నెంబర్లలో ఏం చేసినా మీకు మంచే జరుగుతుందట. ఇక ఒకటి, మూడు, ఆరు, తొమ్మిది లాటరీ టికెట్‌ నెంబర్లు అయితే ఆ లాటరీ తగిలే చాన్స్‌ ఎక్కువగా ఉంటుందట.

ఏడవ నెంబర్‌: రెండు, నాలుగు, పది, పదకొండు, ఇరవై, ఇరవై తొమ్మిది నెంబర్లు ఈ ఏడవ నెంబర్‌ వ్యక్తులకు బాగా కలిసి వస్తాయి. అలాగే ఒకటి, రెండు, నాలుగు, ఎనిమిది నెంబర్లు ఉన్న లాటరీ టికెట్లు మీకు తగిలే చాన్స్‌ ఉంటుంది.

ఎనిమిదవ నెంబర్‌: ఈ నెంబర్‌ జాతకులకు ఐదు, ఆరు, పది, పదిహేను, ఇరవై మూడు నెంబర్లు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ నెంబర్లలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇక ఒకటి, రెండు, ఆరు, ఎనిమిది నెంబర్లు మీకు లాటరీ తగలడంలోనూ గుర్రపు పందాల్లోనూ లాభాలు చేకూరుస్తాయి.

తొమ్మిదో నెంబర్‌: 9వ సంఖ్య కలిగిన వ్యక్తులకు రెండు, మూడు, పదకొండు, ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై తొమ్మిది నెంబర్లు లక్కీయెస్ట్‌ నెంబర్లుగా చెప్తున్నారు. ఇక రెండు, మూడు, ఆరు ఏడు నెంబర్లు లాటరీ టికెట్లలో కానీ గుర్రపు పందేల్లో కానీ ఉన్నట్టయితే మీకు లాభం చేకూరుతుందట.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్‌ టీవీ సొంతంగా క్రియేట్‌ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

 

ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×