గరుడ పురాణంలో జీవితం, మరణం, మరణానంతర జీవితం గురించి ఎంతో వివరంగా ఉంది. గరుడ పురాణంలో మరణం తర్వాత ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుంది? కర్మ ఫలాలు ఎలా ఉంటాయి? స్వర్గం నరకాల గురించి ఇలా ఎన్నో విషయాలు వివరంగా చెప్పారు. అయితే గరుడ పురాణం ప్రకారం నరకానికి వెళ్లకుండా కొంతమందిని ఆపడం చాలా కష్.టం అలాంటి వ్యక్తులు ఎవరో తెలుసుకోండి.
మనిషి తన కర్మలకు తగిన ఫలితాన్ని పొందుతాడు. మీరు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి ఫలితమే మీకు మరణానంతరం వస్తుంది. మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలు చెడు పనులు చేసే వారికి చెడు స్థానం వస్తుందని గరుడ పురాణం చెబుతోంది.
గరుడ పురాణం చెబుతున్న ప్రకారం కొంతమందికి కచ్చితంగా నరకంలోనే స్థానం దొరుకుతుంది. వారు ఎన్ని మంచి పనులు చేసినా కూడా చివరికి వారి దక్కేది నరకమే. ఎలాంటి పనులు చేయడం ద్వారా వారు నరకానికి వెళతారో తెలుసుకోండి.
గరుడ పురాణం ప్రకారం తమను ప్రేమించే వారిని మోసం చేసేవారు, స్నేహితులను మోసం చేసేవారు కచ్చితంగా నరకానికి వెళతారు. మోసానికే నరకమే శిక్ష.
గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు చెప్పే వారికి, దేవుని పేరుతో తప్పుడు ప్రమాణాలు చేసే వారికి కూడా నరకం తప్పదు. దేవుడి పేరు చెప్పి అబద్ధాలు చెప్పేవారే ఎవరైనా కూడా నరకానికి వెళ్లాల్సిందే. అబద్ధం చెప్పాక ఎన్ని మంచి పనులు చేసినా నరకానికి వెళ్లకుండా ఆపడం కష్టం.
తల్లిదండ్రులను పెద్దలను, బంధువులను అవమానించే వ్యక్తులు కూడా మరణానంతరం నరకంలోనే స్థానం పొందుతారు. తమకన్నా పెద్దవారిని గౌరవించాలి. అలా గౌరవించని వాళ్లకి నరకంలో శిక్షలు సిద్ధంగా ఉంటాయి.
స్త్రీలను దోపిడీ చేసే వారిని అవమానించేవారు. నరకంలో అత్యంత భయంకరమైన హింసలకు గురవుతారు. కాబట్టి మీ చుట్టూ ఉండే స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి. వారికి ఏమాత్రం కష్టం కలిగించకండి. మరి అనుమతి లేకుండా వారిని దోపిడీ చేయడం వంటివి చేయకండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని నరకానికి తోసేస్తాయి.
మతం ఏదైనా కూడా గౌరవించవలసిందే. మీ మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాలను విమర్శించడం మంచి పద్ధతి కాదు. అలా విమర్శించే వారికి నరకంలో చోటు దక్కుతుంది. అలాగే దానధర్మాల పేరుతో గొప్పలు చెప్పుకునే వారు కూడా నరకానికి వెళతారు. దానధర్మాలు చేసినా కూడా అదే ఎవరికీ చెప్పకుండా రహస్యంగానే చేయాలి. దాని అప్పుడే దాని ఫలితాలు మీకు దక్కుతాయి. అలా కాకుండా దానధర్మాలు చేస్తూ పది మందికి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే మీకు గరుడ పురాణం ప్రకారం శిక్ష తప్పదు.
కాబట్టి ఒకరిని బాధపెట్టకుండా మీ జీవితం మీరు సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఇతరులను కష్టపెడితే మీకు గరుణ పురాణం ప్రకారం భయంకరమైన శిక్షలు తప్పవు.