Shehbaz Sharif: యుద్ధం జరుగుతుంది అన్న నేపథ్యంలో.. పాక్ నేతల గుండెల్లో భయం మొదలైంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రధానీ షాబాజ్ షరీష్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారంటూ.. అఫిషియల్‌గా పాకిస్థాన్ పీఎమ్ఓ ఒక లెటర్‌ను రిలీజ్ చేసింది. అయితే భారత్ ప్రతీకార చర్యలతో టెన్షన్‌లో పాకిస్థాన్ నేతలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.. పాక్ ప్రధాని అనారోగ్యానికి గల కారణాలపై ఎలాంటి స్పష్టత రాలేదు.. అధికారులు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. రావిల్పిండిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో ఇండియా-పాక్ సరిహద్ధుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వైపు ఉగ్రవాదుల కోసం కశ్మీర్ అడవులను జల్లెడ పడుతోంది. ఇదే అదునుగా పాక్ ఆర్మీ రెచ్చిపోతోంది. లైన్ ఆఫ్ కంట్రోల్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతోంది. వరుసగా వరుసగా ఐదో రోజూ భారత ఆర్మీ పోస్టులే టార్గెట్‌గా కాల్పులు జరుపుతోంది. నిన్న రాత్రి కూడా కుప్వారా, అఖ్నూర్ సెక్టార్‌లలో కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. అయితే తాము కూడా అదే స్థాయిలో బదులిచ్చింది ఇండియన్ ఆర్మీ. మరోవైపు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తూనే.. చొరబాట్లు జరగకుండా అదనపు బలగాలను సరిహద్దుల్లో మోహరించారు.
ఓవైపు పాక్ కవ్వింపు చర్యలు.. మరోవైపు భారత్ కౌంటర్ ఎటాక్స్.. సరిహద్దుల్లో యుద్ధమేఘ వాతావరణం కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు పహల్గామ్ దాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్దం ప్రారంభమవుతుందన్న అంచనాకు పలు దేశాలు వచ్చాయి. ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరికి ఇప్పటిపై పలుదేశాలు మద్దతు ప్రకటించాయి. భారత్ తప్పకుండా యుద్దానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చింది. భారత్‌ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్‌కు తెలుసు. అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్ కోరుతోంది. సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్టు పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.
ఇక మరోవైపు పాక్ పౌరులు భారత్‌ను వీడేందుకు నేడు చివరి రోజు. మెడికల్ వీసాదారులకు ఇవాల్టి వరకు వరకు గడువిచ్చింది కేంద్ర సర్కార్. అయితే గడువు ముగిసినా దేశంలో ఉంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పాక్ పౌరులు దేశం విడిచి వెళ్తారా లేక ఇక్కడ ఉండే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి.
Also Read: అంతకు మించి పకడ్బంధీ ప్లాన్.. రివేంజ్ ఎలా ఉండబోతోందంటే..
ఓవైపు పాక్ కవ్వింపు చర్యలు.. మరోవైపు భారత్ కౌంటర్ ఎటాక్స్.. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు…ఇండియా, పాక్ మధ్య ప్రజెంట్ సిట్యూయేషన్ ఇదీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇప్పటికే త్రివిధ దళాలు వార్ ప్రిపరేషన్‌లో మునిగిపోయాయి. ఈ సమయంలో ఫ్రాన్స్‌తో బిగ్ డీల్ కుదుర్చుకుంది భారత్. రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. 63 వేల కోట్ల రూపాయలతో 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు డీల్ కుదిరింది. ఇది కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్. ఈ డీల్‌కు సంబంధించిన MOUలపై ఇరు దేశాల నేతలు సంతకాలు కూడా చేశారు.
BREAKING NEWS 🚨 Pakistan PM Shehbaz Sharif hospitalised. pic.twitter.com/Sm343kqSLU
— Times Algebra (@TimesAlgebraIND) April 28, 2025