Beggar Zodiac Sign: మీ రాశి ప్రకారం మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే మీకు శాపంగా మారతాయట. దీంతో మీరు ఆర్థికంగా చితికిపోయి.. బికార్లుగా మారిపోయే ప్రమాదం ఉంటుందట. అయితే ఆటువంటి పొరపాట్లు చేయకుండా ముందే మీరు జాగ్రత్త పడితే మీరు ఆర్థికంగా స్ట్రాంగ్ అవుతారట. ఇంతకీ ఆ పొరపాట్లేంటో రాశుల వారీగా ఈ కథనంలో తెలుసుకుందాం.
మేషం: ఈ రాశి వారు ఎంత వేగంగా డబ్బులు సంపాదిస్తే అంతే వేగంగా ఖర్చు చేస్తారు. అప్పుల ఊబిలో పడే అవకాశం ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ లేకపోవడం. ఆర్థికంగా ఇబ్బందులను తెచ్చి పెడుతుంది.
వృషభం: ఈ రాశి వారు సొంత అవసరాలకు తక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. ఎక్కువ సమయం పని చేసి విసిగిపోతారు. డబ్బుపై కలిగే ఆసంతృప్తి మానసిక ఒత్తిడిని పెంచుతుంది.
మిథునం: ఈ రాశి వారు చిన్న చిన్న ఆనందాల కోసం పెద్ద అవకాశాలను తాకట్టు పెడతారు. పొదుపు అలవాటు లేకపోవడం సమస్య. మితిమీరిన సామాజిక జీవితం డబ్బులు ఖర్చు పెట్టేలా చేస్తుంది.
కర్కాటకం: ఈ రాశి వారు భవిష్యత్ భద్రతపై ఎక్కువగా దృష్టి పెడతారు. తక్షణ అవసరాలు మరిచిపోతారు. పొదుకు ఉన్నా.. అసంతృప్తి పెరుగుతుంది. అందుకే వీళ్లు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోనే చాన్స్ ఉంటుంది.
సింహం: ఈ రాశి వారు రాజసంగా జీవించాలనుకునే వారి ఖర్చులు ఎక్కువ అవుతాయి. పేరు కోసం ఖర్చు చేస్తారు. అవసరాలకు మించి ఖర్చు చేయడం వల్ల ఆర్థిక ఒత్తిడికి గురవుతారు.
కన్య: ఈ రాశి వారు లాభాల ఆశతో మితి మీరిన పెట్టుబడులు చేస్తారు. ప్రతి రూపాయిపై ఆత్మవిమర్శ ఎక్కువ చేసుకుంటారు. డబ్బుపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లన ఆధ్యాత్మిక అసంతృప్తిని కలిగిస్తుంది.
తుల: ఈ రాశి వారు ఇతరులను సంతోష పెట్టాలనే తాపత్రయంవల్ల అనవసర ఖర్చులు చేస్తారు. మనస్సులో స్థిరత లేకపోవడంవల్ల ఖర్చులపై ప్రభావం చూపుతుంది. పొదుపు అలవాట్లు లేకపోవడం ఇబ్బందికరం.
వృశ్చికం: ఈ రాశి వారు తమకు తాము బహుమతులు ఇస్తూ విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. డబ్బుల పొదుపు నిర్ణయాన్ని మర్చిపోవడం. అలాగే బహుమతుల విషయంలో అయోమయంగా ఉంటారు. ఖర్చులు చేసిన తర్వాత ఆలోచించి అసంతృప్తిగా ఫీలవుతారు.
ధనస్సు: ఈ రాశి వారు ప్రయాణాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వృథా ప్రయాణాల వల్ల డబ్బులు ఖర్చు చేస్తారు. పొదుపు అసలే చేయరు. ఇదే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది.
మకరం: ఈ రాశి వారు ఆర్థికపరమైన నియంత్రణ ఉన్నప్పటికీ సొంత ఖర్చుల విషయంలో అపరిమితంగా ఉంటారు. దీంతో డబ్బంగా వృథాగా ఖర్చు చేస్తారు. ఎక్కువగా ఖర్చు చేయకూడదని అనుకున్నప్పటికీ ఖర్చుల విషయంలో కంట్రోల్‌గా ఉండరు.
కుంభం: ఈ రాశి వారు భవిష్యత్తుపై గట్టిగా దృష్టి పెట్టడం వల్ల ప్రస్తుతాన్ని మర్చిపోతారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతారు. దీంతో ఒత్తిడి పెరిగి పోవడంతో మానసిక ఆందోళనకు గురవుతారు. అప్పుడు భవిష్యత్తు లక్ష్యాలను కూడా విస్మరిస్తారు.
మీనం: ఈ రాశి వారు డబ్బు పట్ల ఆసక్తి లేకపోవడం వీరికి పెద్ద సమస్య. అలాగే కలల్లో జీవిస్తూ.. ప్రాపంచిక విషయాలను, అవసరాలను మర్చిపోతారు. ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యం చూపడం వీరిని బికారులుగా చేస్తుంది. అలాగే వీరి భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారిపోతుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్ టీవీ సొంతంగా క్రియేట్ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?