BigTV English

LSG Fan : రిషబ్ పంత్ పరువు తీస్తున్నారుగా… ఆ జంపింగ్ లు అంటూ!

LSG Fan : రిషబ్ పంత్ పరువు తీస్తున్నారుగా… ఆ జంపింగ్ లు అంటూ!

LSG Fan :  లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన చివరి మ్యాచ్ లో ఆర్సీబీ పై సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో 118 పరుగులు సాధించడంతో ఆర్సీబీ 237  పరుగులు చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ 33 బంతుల్లో 85 పరుగులు చేసి విజయం లో కీలక పాత్ర పోషించాడు. ఇటీవలే లీగ్ దశలో చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ క్వాలిఫయిర్ 1 కి దూసుకెళ్లి.. ఫైనల్ కి కూడా చేరుకుంది. లక్నో జట్టులో కెప్టెన్ పంత్ 61 బంతుల్లో 118 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్స్ లు బాదాడు. వేలంలో అత్యధిక ధర పలికిన పంత్ ఈ సీజన్ లో అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. కానీ చివరి మ్యాచ్ లో మాత్రం ఫోర్లు, సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.


Also Read :  Babar Azam : బాబర్ నోటి దూల… నడిరోడ్డుపై ఫ్యాన్స్ ను చితకబాదాడు

కేవలం 54 బంతుల్లోనే సెంచరీ చేశాడు పంత్. అనంతరం ఫ్లిప్ జంప్ చేసి అభిమానులను ఆశ్యర్యపరిచారు.  అయితే తాజాగా రిషబ్ పంత్ మాదిరిగానే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంతిని రిషబ్ పంత్ స్టైల్ లో బాది.. రిషబ్ పంత్ ఏవిధంగా అయితే జంపింగ్ చేశాడో అదే మాదిరిగా చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీజన్ లో ప్రస్తుతం ఆర్సీబీ జట్టు ఫైనల్ కి చేరుకుంది. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించి.. క్వాలిఫయిర్ 2 రేస్ లోకి వచ్చింది. ఈ రెండింటిలో విజయం సాధించిన జట్టు ఆర్సీబీతో ఫైనల్ లో తలపడనుంది. ఈ సారి కప్ నమ్దే అని ఆర్సీబీ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.


 

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పై సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోలింగ్స్ చేయడం విశేషం. ఈ సీజన్ లో ఒక ఇన్నింగ్స్ లో మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు పంత్. ఐపీఎల్ సీజన్ లో రూ.27 కోట్లు అత్యధిక ధర పలికడంతో.. ఆ రేంజ్ లో ఆట లేదని గతంలో ట్రోలింగ్స్ చేస్తే.. ప్రస్తుతం సెంచరీ చేసి మరీ చిన్న పిల్లాడిలా ఏంటి..? ఇలా చేశాడు. ఒక జట్టు కి కెప్టెన్ గా ఉన్న వ్యక్తి ఇలా చిన్న పిల్లాడిలా గంతులు వేయడం ఏంటి..? ఏమైనా పిచ్చి పట్టిందా..? అంటూ పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు ఇటీవల వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటాన్స్ పై సెంచరీ చేసిన సమయంలో కూడా పంత్ పై ఘోరంగా ట్రోలింగ్స్ చేసారు. ఈ సీజన్ లో రిషబ్ పంత్ పై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ కావడం విశేషం. దీనిని బట్టి చూస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ వచ్చే ఏడాది పంత్ ని తుది జట్టులో కొనసాగిస్తుందో లేదో అని అనుమానాలు వ్యక్తం కావడం విశేషం.

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×