Virat Kohli : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఐపీఎల్ 2025 సీజన్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్సీబీ జట్టు పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ జట్టు ఫైనల్ కి చేరుకుంది. ఈ సారి కప్పు మనదే అని ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానులు పేర్కొంటున్నారు.చాలా సంవత్సరాల ఓటమిని గెలుపుగా మార్చుకోవాలని ఆర్సీబీ ఆటగాళ్లు ఎంతో ఆశతో ఉన్నారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కోహ్లీ ఫోటోలే, ఎక్కడ విన్నా అతడి పేరే వినిపించడం విశేషం.
Also Read : Babar Azam : బాబర్ నోటి దూల… నడిరోడ్డుపై ఫ్యాన్స్ ను చితకబాదాడు
కేవలం మైదానంలోనే కాదు, మైదానం బయట కూడా కోహ్లీ ఎప్పుడూ చర్చనీయాంశమే. మ్యాచ్ అయిపోయాక కోహ్లీ ఏం చేస్తాడో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంది. ఇప్పుడు కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఒడిశాలోని ఓ ఆలయంలో కోహ్లీని చూసి జనాలు ఆశ్చర్యపోయారు. మైదానంలో ఆడుతున్న కోహ్లీ ఆలయంలో ఏం చేస్తున్నాడని మీకు అనుమానం రావచ్చు. కానీ ఈ వీడియోలో ప్రసాదం ఇస్తున్న వ్యక్తి విరాట్ కోహ్లీ కాదు.. అచ్చం విరాట్ కోహ్లీలా ఉన్న వేరే వ్యక్తి. ఇతను ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న అనంత వాసుదేవ్ ఆలయ పూజారి కోహ్లీని పోలి ఉన్నారు. అందుకే ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. వైరల్ వీడియోలో కనిపించే ఈ పూజారి హెయిర్‌స్టైల్, గడ్డం, దవడ, ముఖ కవళికలు విరాట్ కోహ్లీని పోలి ఉండటంతో జనాలు మోసపోతున్నారు. ఈ వీడియోలో పూజారి ప్రసాదం ఇస్తుండటం చూడవచ్చు. లుంగీ కట్టుకుని, భుజంపై తువ్వాలు వేసుకుని ప్రసాదం గురించి చెబుతున్నారు.
సునీల్ ది క్రికెటర్ అనే యూజర్ ఈ వీడియో ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది విరాట్ కోహ్లీ కాదు అని నాకు నేను ఒప్పుకుంటున్నాను అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేశారు. కోహ్లీ యూకే వెళ్లలేదు. ఆలయంలో భోజనం వడ్డిస్తున్నాడని ఒకరు కామెంట్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్ కథ ఏమవుతుందో అని మరొకరు కామెంట్ చేశారు. రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ ఇదే పని చేస్తాడని ఇంకొకరు రాశారు. బాడీ బిల్డర్ అవతారంలో విరాట్ కోహ్లీ అని మరొకరు వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రపంచంలో ఒకరిలాగే కనిపించే ఏడుగురు ఉంటారట. ఇది అలాగే అని కొందరు అన్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ఏఐ టూల్స్ అని కొందరు కామెంట్ చేశారు. విరాట్ కోహ్లీలా కనిపించే వ్యక్తి ఇంటర్నెట్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు టర్కిష్ నటుడి ఫోటో వైరల్ అయింది. అతను కూడా కోహ్లీ మాదిరిగా కనిపించడం విశేషం.
I am convincing myself that person is not Virat Kohli. pic.twitter.com/Zb05RcgoPf
— Sunil the Cricketer (@1sInto2s) May 29, 2025