BigTV English

Arjuna’s Gandiva: కురుక్షేత్ర యుద్దం ముగిశాక అర్జునుడి గాండీవం ఏమైందో తెలుసా..? అర్జునుడు అలా చేస్తాడని పాండవులు కూడా ఊహించలేదట

Arjuna’s Gandiva: కురుక్షేత్ర యుద్దం ముగిశాక అర్జునుడి గాండీవం ఏమైందో తెలుసా..? అర్జునుడు అలా చేస్తాడని పాండవులు కూడా ఊహించలేదట

Arjuna’s Gandiva: గాండీవం పేరులోనే ఎంతో గాంభీర్యం దాగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ధనస్సుగా గాండీవానికి పేరుంది. అటువంటి గాండీవాన్ని కురుక్షేత్ర యుద్దం ముగిశాక అర్జునుడు ఏం చేశాడో తెలుసా..? అసలు గాండీవం అర్జునుడి దగ్గరకు ఎలా వచ్చిందో తెలుసా..? అర్జునుడి కన్నా ముందు ఈ గాండీవాన్ని ఎవరెవరు ఉపయోగించారో  ఈ కథనంలో తెలుసుకుందాం.


కురుక్షేత్ర యుద్దంలో అర్జునుడు అరివీర భయంకరంగా చెలరేగిపోవడంలో గాండీవం ప్రాముఖ్యత కూడా ఉందట. గాండీవ చేత బట్టి. అర్జునుడు రణ రంగంలోకి దిగాడంటే శత్రువులు ఉప్పెనలో కొట్టుకుపోయిన చీమల్లాగా మారిపోయేవారట. అంతటి శక్తివంతమైన గాండీవం అర్జునుడి దగ్గరకు రావడంలో.. తర్వాత అర్జునుడి నుంచి దూరం కావడంలో ఓ కారణం ఉందట.

పూర్వం దుర్వాస మహర్షి వంద సంవత్సరాల పాటు ఒక యజ్ఞాన్ని నిర్వహించాడట. అలా వంద సంవత్సరాలు సాగిన ఆ యాగగుండంలో నిత్యం ఆజ్యం పోయడం వల్ల అగ్ని దేవుడికి అజీర్తి అయి అప్పటి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండిపోయాడట. రోజులు గడుస్తున్న కొద్దీ ఆహారం తీసుకోకపోవడంతో అగ్నిదేవుడు తన సమస్యను బ్రహ్మదేవుడికి చెప్పుకున్నాడట. దీంతో బ్రహ్మదేవుడు అకండ దివ్య ఔషదాలకు నిలయమైన ఖాండవ వనాన్ని దహించుకోమని అందువల్ల తన అజీర్తి తగ్గిపోతుందని చెప్పాడట.


బ్రహ్మదేవుడి మాట ప్రకారం అగ్ని ఖాండవ వనాన్ని దహించేందుకు వెళ్తుంటే.. విషయం తెలిసిన ఇంద్రుడు అదే ఖాండవ వనంలో నివాసం ఉన్న  తన మిత్రుడు తక్షకుడిని రక్షించాలనుకుని ఆగ్నిదేవుడికి ఆటంకం కలిగించడానికి కుండపోత వర్షం కురిపించాడట. అగ్ని దేవుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా అన్నిసార్లు ఇంద్రుడు వర్షం కురిపించడంతో మళ్లీ అగ్ని దేవుడు, బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నాడట. బాగా ఆలోచించిన బ్రహ్మ.. ద్వాపర యుగంలో నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మిస్తారు. అప్పుడు వారి ఖాండవ వనాన్ని దహించే అవకాశం వస్తుందని చెప్తాడట.

ద్వాపరయుగంలో కృష్ణార్జుల దగ్గరకు వెళ్లి మాట తీసుకున్న అగ్నిదేవుడు ఖాండవ వన్నాన్ని దహించివేస్తుంటే.. ఇంద్రుడు కురిపించే వర్షాన్ని ఆపడానికి అర్జునుడి దగ్గర సరైన దనస్సు లేకపోవడం ఇబ్బంది పడేవాడట. దీంతో అగ్నిదేవుడు తన మిత్రుడైన వరుణ  దేవుడిని ప్రార్థిస్తే ఆయన వచ్చి అర్జునుడికి గాండీవం ఇచ్చాడట. ఎన్ని బాణాలు వేసినా గాండీవంలో మరో బాణం రెడీగా ఉంటుందట.

అలా ఖాండవ దహన సమయంలో గాండీవాన్ని పొందిన  అర్జునుడు కురుక్షేత్ర యద్దంలో శత్రువులను చెండాడి విజేత నిలబడ్డాడని భారతంలో చెప్పబడింది. ఇక కురుక్షేత్ర యుద్దం తర్వాత కూడా గాండీవం అర్జునుడితో పాటే ఉండేదని.. పాండవులు తమ అవతారాలు చాలించడానికి ఒక్కోక్కరుగా హిమాలయాల వైపు వెళ్తుంటే.. అప్పుడే వారికి వరుణదేవుడు ప్రత్యక్షమై అర్జునుడికి ఇచ్చిన గాండీవ అవసరం తీరిందని ఇక దాన్ని తిరిగి ఇచ్చేయమని అడిగాడట. అయితే అప్పటికీ హిమాలయాలలో ప్రయాణం చేస్తున్న తమకు గాండీవం అవసరం వస్తుందేమోనని మిగతా పాండవులు భావిస్తే.. అర్జునుడు మాత్రం వరుణదేవుడు అడిగిన వెంటనే గాండీవాన్ని ఇచ్చేశాడని పురాణాల ప్రతీతి. అలా అర్జునుడి నుంచి తీసుకున్న గాండీవాన్ని వరుణదేవుడు సముద్రంలో వదిలిపెట్టాడట.

గాండీవం స్వర్గంలోని గాండీవ వృక్షం నుంచి తయారు చేశారని దీనికి దేవతలు కూడా పూజలు చేసేవారట. దీనికి లక్షలాది ఆయుధాలతో సమానమైన శక్తి ఉందట. అయితే గాండీవం మొదట బ్రహ్మదేవుడి దగ్గర వెయ్యి సంవత్సరాలు, తర్వాత ప్రజాపతి వద్ద 5 వందల సంవత్సరాలు, వరుణదేవుడి దగ్గర వంద సంవత్సరాలు ఉన్నదట. ఆ తర్వాత వరుణదేవుడు అర్జునుడి ఇచ్చాడని భారతంలో చెప్పబడింది.

 

ALSO READ: గ్రహబాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్‌ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Big Stories

×