Shukra Gochar 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెలలో, రాక్షస గురువు శుక్రుడు మీన రాశిలో ప్రత్యక్ష గమనంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఏ రాశి వారి పట్ల దయ చూపితే.. ఆ రాశి వారి జీవితంలో ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో వృద్ధి, ఆర్థిక లాభం లభిస్తాయని చెబుతారు. శుక్రుడు మీన రాశిలో నేరుగా మారడం వల్ల మాలవ్య , లక్ష్మీ నారాయణ రాజ్యయోగం ఏర్పడింది. ఇది 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి ఎక్కువ మేలు కలిగిస్తుంది. ఫలితంగా ఈ వ్యక్తులు సంపద, గొప్పతనం, శ్రేయస్సు, విలాసం మొదలైన వాటిని పొందుతారు. ఆ 3 అదృష్ట రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి మాలవ్య , లక్ష్మీ నారాయణ రాజయోగం అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. మీరు వ్యక్తులు ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో విస్తరణకు కూడా అవకాశం ఉంది. ఆర్థిక బలం కారణంగా.. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. అంతే కాకుండా మీరు పనిచేసే చోట అధికారులు మీపై ప్రశంసలు కురిపిస్తారు. అంతే కాకుండా మీరు కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి శుక్రుడి సంచారం అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాకుండా మీరు ఈ సమయంలో కూడా మీకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. కొత్త ఒప్పందాలు పొందడం వల్ల వ్యాపారవేత్తలు కూడా బిజీగా ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలు రావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. అదృష్టం వల్ల మీ ప్రతీ పని సులభం అవుతుంది. అంతే కాకుండా మీరు ఉన్నత స్థానంలో ఉండేందుకు అవకాశాలు కూడా పెరుగుతాయి.
Also Read: అక్షయ తృతీయ రోజు.. ఈ 4 వస్తువులు కొన్నా బంగారంతో సమానం
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి.. మాలవ్య , లక్ష్మీ నారాయణ రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది. అలాగే.. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మళ్ళీ మెరుగుపడతాయి. కుటుంబంలో వాతావరణం బాగుంటుంది.దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.