Akshaya Tritiya 2025: సనాతన ధర్మంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అక్షయ తృతీయ రోజు శుభ కార్యాలు ప్రారంభించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున బంగారం కొనడం వల్ల ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. అక్షయ తృతీయ 2025 తేదీ, శుభ సమయం, పూజ విధానం, చేయాల్సిన దానధర్మాలు, జపం, హవనము మొదలైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సనాతన ధర్మం ప్రకారం అక్షయ తృతీయకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగను ‘అఖా తీజ్’ అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోజున.. లక్ష్మీదేవిని, విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు చేసే దానధర్మాలు, పుణ్య స్నానం, జపం, హవనము మొదలైన వాటి పుణ్యం జీవితాంతం ఉంటుందని చెబుతారు. అక్షయ తృతీయ రోజున కొత్త పనులను ప్రారంభించడం మంచిది. ఈ రోజున బంగారం కొనడం వల్ల ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తాయి.
అక్షయ తృతీయ ఎప్పుడు ?
ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం ఏప్రిల్ 29న సాయంత్రం 5:29 నుండి ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 వరకు అక్షయ తృతీయ సమయం ఉంటుంది. ఉదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటే.. అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 30న జరుపుకుంటారు.
అక్షయ తృతీయ శుభ సమయం:
పంచాంగం ప్రకారం.. అక్షయ తృతీయ పూజా శుభ సమయం ఏప్రిల్ 30, 2025న ఉదయం 6:07 నుండి మధ్యాహ్నం 12:37 వరకు ఉంటుంది. ఇదే సమయం.. బంగారం కొనడానికి మంచిది. ఏప్రిల్ 29న ఉదయం 5:33 నుండి ఏప్రిల్ 30న తెల్లవారుజామున 2:50 వరకు శుభ సమయం ఉంటుంది.
పూజా విధానం:
అక్షయ తృతీయ రోజున.. ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి.. శుభ్రమైన బట్టలు ధరించండి. ఉపవాసం ఉండే వారు ఇంట్లోని విష్ణువు , లక్ష్మీ దేవి విగ్రహాలను పూజించండి. పూజ సమయంలో పూలు, ధూపం, దీపాలు ,నైవేద్యాలు సమర్పించండి. అలాగే విష్ణు సహస్రనామం , లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయండి. చివరికి ప్రసాదం సమర్పించండి.
Also Read: సూర్య గ్రహణం రోజు.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి
అక్షయ తృతీయ ప్రాముఖ్యత:
మత విశ్వాసాల ప్రకారం.. పరశురాముడు అక్షయ తృతీయ రోజున భూమిపై అవతరించాడు. అందుకే ఈ రోజును పరశురాముడి జన్మదినంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు వివాహంతో సహా ఏ శుభ కార్యం అయినా శుభ సమయం చూడకుండా చేయవచ్చు. అక్షయ తృతీయను అన్నపూర్ణ తల్లి జన్మదినంగా, గంగా మాత భూమిపైకి రాకకు ప్రతీకగా కూడా జరుపుకుంటారు.