BigTV English

Snake Bite:10వ తరగతి పరీక్షా కేంద్రంలో అధికారిని కాటేసిన పాము

Snake Bite:10వ తరగతి పరీక్షా కేంద్రంలో అధికారిని కాటేసిన పాము

Snake Bite: పల్నాడు జిల్లా.. చిలకలూరిపేట వేద స్కూల్‌..! టెన్త్‌ ఎగ్జామ్స్‌తో స్కూల్ మొత్తం నిశబ్ధంగా ఉంది. విద్యార్థులు సీరియస్‌గా ఎగ్జామ్ రాస్తున్నారు. ఇంతలోనే టెన్త్‌ ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్‌ కరీముల్లా ఇన్స్‌‌పెక్షన్‌కు వెళ్లారు. విద్యార్థులను పరిశీలిస్తూ వస్తుండగా.. పాము కాటేసింది. వెంటనే అలర్టయిన టీచర్లు, ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కరీముల్లా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మూడు రోజులపాటు ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఎగ్జామ్ సెంటర్లలోకి పాము రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సాధారణంగా పాములు పొలాలు, అడవుల్లోనూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో.. నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే చెట్లను ఎక్కువగా నరికివేయడం వల్ల పాములు జనాల్లోకి వచ్చేస్తున్నాయి. దీనికి తోడు పారిశ్రామికీకరణ వల్ల నీటి కాలుష్యం పెరగడంతో అవి బయట తిరుగుతున్నాయి. అందులో ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది. వేడి తాపానికి పాములు తేమ కోసం జనాలు ఉండే ప్రాంతాల్లోకి సంచరిస్తూ ఉంటాయి. పాముల బెడద తగ్గాలంటే.. విచ్చలవిడిగా అడవులను నరికి వేయడం ఆపాలి.

నీటి కాలుష్యాన్ని తగ్గించాలి. పాము కరిచినప్పుడు.. మంత్ర వైద్యం. నాటు వైద్యం కాకుండా తప్పనిసరిగా హాస్పటల్‌కి వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్య వహించకూడదు. ముఖ్యంగా భయపడకుండా.. ధైర్యంగా ఉంటే సగం బ్రతికినట్లే..


ఇదిలా ఉంటే.. పల్నాడు జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో గందరగోళం నెలకొంది. ఓ పరీక్షా సెంటర్ కు బదులు మరో సెంటర్ లో పరీక్షలు నిర్వహించారు. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. నకరికల్లులో ఎగ్జామ్ సెంటర్ తారుమారైనా అధికారులు పట్టించుకోలేదు. విశ్వశాంతి స్కూల్ పేరుతో సెంటర్ ఉండగా.. అక్షర స్కూల్లో ఎగ్జామ్ నిర్వహించారు. ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అధికారులు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను వివరణ అడుగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

మరోవైపు ప్రొద్దుటూరులో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. సోషల్‌ మీడియాలో ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేసి తోటి విద్యార్థినులను వేధించాడు ఓ విద్యార్థి. ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. అదే స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి..ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో..విద్యార్ధినుల వేధింపులకు పాల్పడ్డాడు.

ఫోన్ నెంబర్లకు, అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ.. రోజు తమను వేధిస్తున్నాడని విద్యార్థినులు టీచర్‌కు కంప్లైంట్ చేసారు. దీంతో ఆ బాలుడిని టీచర్ మందలించాడు. కోపంతో రగిలిపోయిన ఆ బాలుడు…తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు టీచర్‌పై మండిపడ్డారు. దీనిపై పోలీస్ స్టేషన్లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎంఈఓ సమక్షంలో విచారణ జరగగా.. వేధింపుల విషయం బయటపడింది. దీంతో బాలుడిపై , తల్లిదండ్రులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

 

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×