January Numerology : మీరు జనవరి నెలలో పుట్టారా..? న్యూమరాలజీ ప్రకారం జనవరిలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా..? ఏఏ రంగాల్లో మీరు రాణిస్తారో తెలుసా..? అసలు మీ ఫీచర్ ఎలా ఉండబోతుందో తెలుసా..? మీరు పుట్టిన జనవరి నెలలోనే ఎంత మంది గొప్ప వ్యక్తులు పుట్టారో తెలుసా..? మొత్తానికి జనవరిలో పుట్టిన వ్యక్తుల గురించి న్యూమరాలజీలో ఏముందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది న్యూమరాలజీని నమ్ముతున్నారు. సంఖ్యాశాస్త్రాన్ని మనిషి జీవితంలో భూత, భవిష్యత్తు, వర్తమానాలను అంచనా వేయడంలో ఉపయోగిస్తారు. పూర్వ కాలం నుంచే మన దేశంలో సంఖ్యాశాస్త్రం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. జ్యోతిష్యశాస్త్రంతో సమానంగా ఈ న్యూమరాలజీని ప్రజలు నమ్ముతారు. అయితే న్యూమరాలజీ ప్రకారం జనవరి నెలలో పుట్టిన వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయి. వారు ఎలాంటి వృత్తుల్లో రాణిస్తారు. ఈ నెలలో పుట్టిన ధోరణి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి నెలలో పుట్టిన వ్యక్తులు చాలా మంది తాము పుట్టిన ప్రాంతాన్ని వదిలేసి దూర ప్రాంతాలకు వలసవెళ్లి బతుకుతారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ నెలలో పుట్టిన వారు అందమైన ముఖం, మంచి వ్యక్తిత్వం, ధైర్యము కలిగి ఉంటారు. ఈ నెలలో కొంత మంది కోటీశ్వరుల ఇంట్లో పుడితే మరికొంత మంది పేదల ఇండ్లలో పుడతారు. అయినా స్వశక్తితో జీవితంలో పైకి ఎదిగి కోటీశ్వరులు అవుతారు. ఈ నెలలో పుట్టిన వ్యక్తులకు పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేయాలని అనుకుంటే ఎవరు వద్దనా చేసే వరకు ఆగరు. అలాగే దూరదృష్టి కూడా వీరికి ఎక్కువే.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే ఊహించగలరు. ఉదాహరణకు ఈ నెలలో పుట్టిన వ్యక్తులు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఫ్యూచర్‌లో పెరిగే షేర్స్ ఏవో ముందే పసిగట్టగలరు. అలాగే ఈ నెలలో పుట్టిన వ్యక్తులుకు నిజాయితీ కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. పొదుపు చేయడంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ వీరు సిద్దహస్తులు. వీరికి దైవ భక్తి కూడా చాలానే ఉంటుంది. తరచుగా ఆలయాలు సందర్శిస్తుంటారు. ఈ నెలలో పుట్టిన కొంత మంది కొన్ని సందర్బాలలో తమను తాము నమ్మకపోవడం.. కఠినంగా వ్యవహరించడం లాంటి స్వభావాలు కలిగి ఉంటారు. అయితే ఏ విషయం అయినా ఎదుటి వ్యక్తులకు వీరు నిర్మోహమాటంగా చెప్తారు.
జనవరి నెలలో పుట్టిన కొందరు బంధువుల వల్ల కానీ.. స్నేహితుల వల్ల కానీ ఆస్తులు పోగొట్టుకుంటారు. అయితే తిరిగి తమ స్వయంకృషితో పొగొట్టుకున్న వాటికి రెండు రెట్లు అధికంగా ఆస్థులు సంపాదిస్తారు. జనవరిలో పుట్టిన వ్యక్తులకు విప్లవాత్మకమైన ఆలోచనలు ఉంటాయి. సంఘంలో గొప్ప మార్పులు తీసుకురావాలని తపన పడుతుంటారు. కష్టాల్లో ఉన్న వ్యక్తులకు ఏదైనా సాయం చేయాలని వారిని ఎలాగైనా ఆదుకోవాలనే ఆవేదన పడుతుంటారు. పాత మూస పద్దతులకు స్వస్తి పలికి నూతనత్వాన్ని సృష్టించాలనే భావం అధికంగా ఉంటుంది. వీరిలో చాలా మందికి దేశ విదేశాలు తిరిగి నూతన ఆచార వ్యవహరాల గురించి తెలుసుకోవాలనే కుతుహాలం ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వ్యక్తులకు ఎవరైనా ఎదురు చెబితే తట్టుకోలేరు. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండాలంటారు. వీరు క్రీడాకారులుగా రాణిస్తారు. జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. వీరిలో చాలా మందికి 28 సంవత్సరాల తర్వాతే జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఈనెలలో చాలా మంది గొప్ప వ్యక్తులు పుట్టారు. వారిలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ లాంటి వారు ఉన్నారు.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు