Viral Video : సాధారణంగా క్రికెట్ లో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటాయి. మనం నిత్యం తరచూ ఏదో ఒక సందర్భంలో చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఇటీవల ఓ మ్యాచ్ లో ఒక యువకుడు రెండు చేతులతో బౌలింగ్ వేసి బ్యాటర్ కి అర్థం కాకుండా వికెట్లు పడగొట్టాడు. మరో సందర్భంలో క్యాచ్ కోసం కింద పడిన సంఘటనలు చాలానే జరుగుతాయి. ఇక అప్పుడప్పుడు బ్యాటర్లకు అలాగే బౌలర్లకు దెబ్బలు తలుగుతాయి. కొన్ని సార్లు బ్యాటర్లు కొట్టిన బంతులకు ఎంఫైర్లు తప్పించుకోకుండా గాయాలపాలైన ఘటనలు.. వికెట్లకు విసిరి కొడితే బ్యాటర్లకు గాయాలు ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
Also Read : Rahul Dravid: సంజు శాంసన్‌తో గొడవలు… ద్రవిడ్ హాట్ కామెంట్స్ !
మరి కొన్నిసార్లు ఎంపైర్లు కూడా గాయాల పాలవుతారు. అయితే తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. తాజాగా ఓ మ్యాచ్ లో బ్యాటర్ బంతిని కొట్టగా అది సిక్స్ కి వెల్లింది. దీంతో బ్యాట్ ని విసిరి వేసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఆ బ్యాట్ ఎంపైర్ కాలికి తాకడంతో ఎంపైర్ కి గాయమైంది. ఇక మరో బ్యాట్స్ మెన్ బంతి కోసం ఉరకడం చూస్తూంటే ఈ వీడియో చాలా వింతగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఆ వీడియో కింద కామెంట్స్ ని నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు కేవలం గల్లీ క్రికెట్ లోనే కాదు.. ఐపీఎల్ లో కూడా చోటు చేసుకుంటాయి. ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ 55 బంతుల్లోనే 141 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో సెంచరీ చేసినప్పుడు అభిషేక్ శర్మ నోట్ తీసి అభిమానులకు చూపించాడు. ఆ నోట్ వైరల్ అయింది. అయితే ముంబైతో జరిగిన సమయంలో సూర్య కుమార్ యాదవ్ ఓవర్ గ్యాప్ లో అభిషేక్ శర్మ జేబులు చెక్ చేయడం విశేషం. మరోవైపు మళయాళ హీరో ఉన్ని ముకుందన్ కూడా కేరలలో గ్రామాలన్నీ చుట్టేస్తున్నాడు.
Also Read : Bowling Action: ఎవడు మమ్మీ వీడు.. ఇలా బౌలింగ్ వేస్తున్నాడు.. అర్జెంట్ గా SRHలోకి తీసుకురండి
ఈ తరుణంలో ప్రయాణం మధ్యలో చిన్నపిల్లాడిలా మారిపోయింది. తను బైకు పై వెళ్తున్న క్రమంలో గ్రామీణ ప్రాంతంలో ఓ చోట పొలం గుట్లలో స్థానిక పిల్లలు క్రికెట్ ఆడటం చూశాడు. తన బాల్య స్మృతులను మదిలో మేల్కొన్నాయేమో కానీ తను కూడా చిన్న పిల్లాడిలా మారిపోయాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసి వారిలో కలిసి పోయాడు. పిల్లలతో కలిసి పొలం గట్లతో క్రికెట్ ఆడుతూ మురిసిపోయాడు. ఇలా ఈ మధ్య కాలంలో క్రికెట్ లో పలు సంఘటనలు చోటు చేసుకోవడం.. వైరల్ కావడం విశేషం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.
Batter reminds Umpire to give SIX 😂 pic.twitter.com/lujUMuTSOX
— Richard Kettleborough (@RichKettle07) April 19, 2025