E-Paper
Advertisement

Anasuya : ఏమా అందం కాదు… ఏంటీ ఈ కర్మ… సోషల్ మీడియాలో పేలుతున్న ట్రోల్స్

Anasuya : ఏమా అందం కాదు… ఏంటీ ఈ కర్మ… సోషల్ మీడియాలో పేలుతున్న ట్రోల్స్
Advertisement

Anasuya: స్టార్ మా ఛానల్ లో రేపటి ఆదివారం కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్ షోలో అందాల నటి అనసూయ, శేఖర్ మాస్టర్ ఇద్దరూ ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఉంటారు. గర్ల్స్ టీం ని సపోర్ట్ చేస్తూ అనసూయ, బాయ్స్ టీమ్ ని సపోర్ట్ చేస్తూ శేఖర్ మాస్టర్ ఈ గేమ్ షో లో పాల్గొంటారు. గర్ల్స్ బాయ్స్ టీమ్స్ మధ్య ఫన్ ఎంటర్టైన్మెంట్, త్రిల్లింగ్ ఛాలెంజెస్ తో కూడిన పోటీలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఈ షోముఖ్య ఉద్దేశం కామెడీ అని చెప్తారు కానీ, షోచూస్తే హాస్యం కన్నా, అనసూయ అందం,శేఖర్ మాస్టర్ ఆమెని పొగడడం పైనే ఉంటుంది.తాజాగా రేపటి ఆదివారం రిలీజ్ అయ్యే ప్రోమో హైలెట్స్ ఇప్పుడు చూద్దాం..

ప్రోమో అంతా ఆమె ..

Advertisement

కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 మార్చి 29 2025 న ప్రారంభించారు. సీజన్ 2 సక్సెస్ తో ముందుకు వెళ్తుంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో శ్రీముఖి బాయ్స్ మీరంతా రిలాక్స్ అవ్వండి మాస్టర్ వస్తారు అని అంటుంది. శేఖర్ మాస్టర్ అనసూయ దగ్గరికి వచ్చి నిలబడతాడు. అనసూయ శేఖర్ మాస్టర్ ని చూసి పక్కకు వెళ్లి సిగ్గుపడుతుంది. వెనుక నుండి బ్యాక్గ్రౌండ్ లో ఏమా అందం ఏమా అందం అనే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. అనసూయ సిగ్గుపడుతూ ఉంటుంది. శేఖర్ మాస్టర్ అనసూయ బ్యాక్ నుండి చూస్తాడు. వెనకనుంచి చూడలేక చచ్చిపోతున్నాం అనే డైలాగ్ ప్లే అవుతుంది. అనసూయ సిగ్గుపడుతూ పక్కకు వెళుతుంది. ఈ వీడియో చూసిన వారంతా, కిలాడి భామ అనసూయ అందం పొగడ్డానికే ఈ షోని పెట్టినట్లుగా ఉంటుంది. ఇది చూసిన వారంతా ఏంటి ఈ కర్మ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే అనసూయ, శేఖర్ మాస్టర్ మీద సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రోమో చూసిన తర్వాత అనసూయ అందం కాదు ఏంటి ఈ కర్మ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.

కెరీర్ ఇలా ..

Advertisement

అనసూయ యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి నటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుస్థిర స్థానాన్ని సంపాదించింది. క్షణం సినిమాతో మొదలుపెట్టి, రంగమ్మత్తగా అందరి మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ, విభిన్నమైన పాత్రను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు. రిక్త ఇటీవల విడుదలయ్యే సినిమాల్లో ఎక్కువ సినిమాలు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసినవే అవటం విశేషం.

Aditi Rao Hydari : నా వంట మనిషి… అయ్యో కట్టుకున్న భర్తను అంత మాట అనేసిందేంటి భయ్యా.. .

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×