BigTV English
Advertisement

Sri Janmashtami: ద్వారకలో ఘనంగా జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు.. అందంగా ముస్తాబైన ఆలయాలు

Sri Janmashtami: ద్వారకలో ఘనంగా జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు.. అందంగా ముస్తాబైన ఆలయాలు

Sri Janmashtami: ప్రతీ ఏడాది దేశ వ్యాప్తంగా కృష్ఱాష్టమి/ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా గుజరాత్‌లోని ద్వారకలో జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో జరుపుకునే పండుగల్లో జన్మాష్టమి కూడా ప్రత్యేకమైనది. కృష్టుడు జన్మించిన మరియు పరిపాలించిన ద్వారకలో జన్మాష్టమి వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు.


కృష్ణుడి జయంతి నాడు జరిగే వేడుకలకు దేశ వ్యాప్తంగా ద్వారకలోని ప్రసిద్ధ దేవాలయాలకు లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. జన్మాష్టమి వేడుకలకు కృష్ణుడి ఆలయాలను 15 రోజుల ముందు నుంచే అందంగా అలంకరిస్తుంటారు. ముఖ్యంగా మదురై, బృందావన్, ఇస్కాన్ వంటి ప్రాంతాల్లో అయితే కన్నయ్య పుట్టిన రోజు వేడుకల వైభవాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. చుడముచ్చటగా జరిగే ఈ వేడుకలకు ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన కృష్ణుడి ఆలయాలలో విభిన్న రకాలుగా వేడుకలు జరుగుతాయి.
సోమవారం ఆగస్టు 26వ తేదీన కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి. శ్రావణమాసంలోని కృష్ణ పక్ష తిథి నాడు రోహిణీ నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ ఏడాది ఈ రోజున కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు. ముఖ్యంగా కృష్ణుడు పరిపాలించిన ద్వారక ప్రాంతం ఈ వేడుకలను ప్రత్యేకమైనది.

జన్మాష్టమి వస్తుందనే కొద్ది రోజుల ముందు నుంచే ద్వారకలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. కన్నయ్య పుట్టిన రోజును జరుపుకునేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు అంతా భారీ ఎత్తున తరలివస్తుంటారు. అక్కడి ఆలయాలన్నీ అందంగా ముస్తాబు చేసి కన్నయ్యకు మొక్కులు అప్పజెప్పుతుంటారు. కేవలం ఆలయాలే కాదు ద్వారకా నగరం అంతా అందంగా తయారవుతుంది. మరోవైపు అక్కడి ఆలయాల్లో కొలువైన కృష్ణుడి విగ్రహానికి భక్తులు ఆభరణాలను అలంకరిస్తుంటారు. రాత్రివేళ అలంకరణ తర్వాత అరగంట తర్వాత కన్నయ్యకు నైవేద్యం సమర్పిస్తారు.


ఈ క్రమంలో ఈ కార్యక్రమాలన్నింటినీ భక్తులు దర్శించుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే రాత్రి 12 గంటల సమయంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాదు 2 గంటల తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. ఉదయం కృష్ణుడికి మంగళహారతులు ఇచ్చి పూజలు ప్రారంభిస్తారు. భోగ్ తెరను సమర్పించి కాసేపటికి తొలగిస్తారు. ఇలా కృష్ణుడిని దర్శించుకోవడానికి వచ్చిన వేల మంది భక్తులకు దహీ హండీ వంటి ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.

మరోవైపు కృష్ణాష్టమి నాడు కన్నయ్య వేషాధరణతో చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వరకు అందంగా ముస్తాబవుతారు. మరోవైపు ఆడపిల్లలు అందమైన గోపిక వేషాధరణతో దర్శనమిస్తుంటారు. కన్నయ్య గోపికల చుట్టూ తిరుగుతూ అల్లరి చేస్తూ పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కన్నయ్యకు ఇష్టమైన వెన్నను ఓ కుండలో పెట్టి దానిని ఉట్టిపై పెట్టి ఆటలు కూడా నిర్వహిస్తుంటారు. ఉట్టి కొట్టడం వంటి ఆటల్లో గోపికలు, కన్నయ్యలు పాల్గొంటారు. ఇలా జన్మాష్టమి నాడు అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకుంటారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×