BigTV English

kavitha bail petition: కవిత‌కు నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చేవారం

kavitha bail petition: కవిత‌కు నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చేవారం

kavitha bail petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని ఈడీ కోరింది. దీంతో న్యాయస్థానం వచ్చేవారానికి (ఆగష్టు 27కు) విచారణ వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కౌంటర్లపై రిజాయిండర్ వేస్తామని తెలిపారు కవిత తరపు న్యాయవాదులు.


మంగళవారం ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. ఈ కేసులో మనీష్ సిసోడియాకు ఇప్పటికే బెయిల్ వచ్చిందని వాదించారు కవిత తరపు న్యాయ వాదులు. ఏకైక మహిళా నిందితురాలు కవిత అని, నాలుగు నెలలుగా కవితను జైలులో ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సమయంలో జోక్యం చేసుకున్న ఈడీ, అఫిడవిట్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది. గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. శుక్రవారం లోపు రీజాయిండర్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది.


ALSO READ: హైదరాబాద్ కు రెడ్ అలర్ట్.. మళ్లీ క్లౌడ్ బరస్ట్ ?

అటు కవిత బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. దీంతో ఈడీ తన అఫిడవిట్‌లో ఏయే అంశాలు తెరపైకి తీసుకొస్తుందోనన్న చర్చ మొదలైపోయింది. వచ్చేవారం కవితకు బెయిల్ రావడం ఖాయమని బీఆర్ఎస్ నేతల మాట.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×