E-Paper
Advertisement

Hidden temples: అరుణాచలంలో మిస్టరీ శివలింగాలు – ఇంకా ఎవరికీ తెలియని ఆలయాలెన్నో

Hidden temples: అరుణాచలంలో మిస్టరీ శివలింగాలు – ఇంకా ఎవరికీ తెలియని ఆలయాలెన్నో

Hidden temples: దేవ భూమి అరుణాచలంలో అడుగడుగునా శివలింగాలు దర్శనమిస్తాయి. అయితే చాలా మందికి కొన్ని శివలింగాల గురించి అసలు తెలియదు. అలాగే మొదటిసారి అరుణాచలం వెళ్లే వాళ్లకు అసలే తెలియదు. అలాంటి వారి కోసం అరుణాచలంలో ఎక్కడెక్కడ ఏయే శివలింగాలు ఉన్నాయి. ఎలా దర్శనం చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్రహ్మలింగం: ఇక్కడి నుంచే గిరి ప్రదక్షిణ ప్రారంభించాలని పండితులు చెప్తున్నారు. చాలా మంది  ఈ బ్రహ్మలింగం ఉన్న ప్రధాన దేవాలయం నుంచే గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు.

ఇంద్ర లింగం: ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం దీనికి శుక్రుడు – సూర్యుడు అధిదేవతలు. ఈ లింగాన్ని దర్శించుకుంటే కెరీర్ కి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

అగ్నిలింగం: అరుణగిరి చుట్టూ మొత్తం 8 శివలింగాలున్నాయి.. వాటిలో ఏడు రోడ్డుకి ఎడమవైపు ఉంటే అగ్నిలింగం కుడివైపు ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కష్టకాలంలో ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తాడు.

శేషాద్రి స్వామి: ఈయన కామాక్షి అమ్మవారి స్వరూపంతో జన్మించారని చెబుతారు. అవధూత స్వరూపంలో భక్తులను అనుగ్రహించేవారు.

దక్షిణా మూర్తి: ఇది చాలా పురాతనమైన, శక్తివంతమైన ఆలయం… దాదాపు 1500 ఏళ్ల క్రితం నుంచి ఈ ఆలయం ఉంది.

రమణాశ్రమం: ఇక్కడ రమణమహర్షి తల్లి సమాధి ఉంటుంది.. దానికి నమస్కరించుకుని రమణాశ్రమంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. మీనాక్షీ, సుందరేశ్వరుడు, గణేశ ఆలయాలు -పార్వతీ పరమేశ్వరుల శక్తి ఇక్కడుందని భక్తుల విశ్వాసం

ద్రౌపది ఆలయం: ఇక్కడ నుంచి గిరి దర్శనం అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎదురుదెబ్బలు తిని విసిగిపోయినవారికి మానసిక స్థైర్యాన్నిస్తుంది ఈ ఆలయం.

యమలింగం:  యముడు పూజించిన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అకాలమృత్యువు దరిచేరదు. మృత్యుభయం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

పృథ్విలింగం: అరుణాచలం గిరిచుట్టూ ఉన్న 8 శివలింగాల్లో ఇదొకటి. ఈ లింగాన్ని దర్శించుకుంటే కష్టాలు దూరమవుతాయట.

దుర్వాస ఆలయం: ఇక్కడ దూర్వాసుడిని కుంతీ దేవి ప్రతిష్టించిందని చెబుతారు. ఇక్కడున్న వేపచెట్టుకి పసుపుదారాలు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని, రాళ్లు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని భక్తుల విశ్వాసం.

అప్పు నంది: పంచభూతాలకు సంబంధించిన నందుల్లో ఇది జలసంబంధ నంది.  వివాదాలను సమసిపోయేలా చేసి బంధాలను వృద్ధి చేస్తుంది ఈ నంది దర్శనం.

తేయు నంది: ఈ నంది నుంచి చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం ఉంటుంది. బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావాల్సిన జ్ఞానం ఇక్కడి నుంచి పొందారని చెబుతారు. అందుకే ఇక్కడి నుంచి బహ్మదేవుడిలా కనిపిస్తుంది గిరి.

శోణ తీర్థం: ఇక్కడ రెండు నందులుంటాయి. ఇక్కడున్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అంటారు. రమణమహర్షి గిరిప్రదిక్షిణ చేసేటప్పుడు సేదతీరిన ప్రదేశం ఇది.

నైరుతి లింగం: అష్ట లింగాల్లో నాలుగోది ఇది. రాక్షసరాజు నిరుతి ( నైరుతి దిక్కుకి అధిపతి) ప్రతిష్టించిన విగ్రహం ఇది. ఈ క్షేత్రానికి అధిపతి రాహువు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కీర్తి ప్రతిష్టలు వస్థాయి

నంది ముఖ దర్శనం: ఇక్కడి నుంచి గిరి వైపు చూస్తే.. నంది ముఖంలా కనిపిస్తుంది

ఆకాశ నంది: పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో నాలుగోది ఆకాశనంది.

రాజ రాజేశ్వరి ఆలయం:  ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం. ఇక్కడి నుంచి కొండను చూస్తే పార్వతీదేవి కొండ మాత్రమే కనిపిస్తుంది.

సూర్య లింగం: అరుణగిరి పైనుంచి వెళ్లిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్లీ తేజస్సు పొందాడని చెబుతారు. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుందట.

వరుణ లింగం: ఈ లింగానికి అధిదేవత శని. గ్రహదోషాలు తొలగించే శక్తి ఉన్న లింగం ఇది.

ఆది అణ్ణామలై: బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి కన్నా ముందే ఉందట.

వాయు లింగం:  ఈ ఆలయంలో కూర్చుంటే బయట ఎండగా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది..ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు

చంద్ర లింగం: చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం ఇది. దీనిని దర్శించుకుంటే మీ జీవితంలో ఉండే కష్టనష్టాలు బాధలు తొలగిపోతాయట.

అధికార నంది: శ్రీశైలంలో సాక్షి గణపతిలా అరుణాచలంలో అధికారి నంది ఉంటుంది. ఈ నంది చెవిలో గోత్రనామాలు చెప్పుకోవాలట.

అగస్త్య ఆశ్రమం: ఇక్కడి నుంచి కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరూ కలసి కనిపిస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహం, సంతాన దోషాలు తొలగిపోతాయట.

కుబేర లింగం: లక్ష్మీదేవి ఈ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించిందట.  ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయట.

పంచముఖ దర్శనం: ఇక్కడి నుంచి గిరిని చూస్తే ఐదు ముఖాలుగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగించే ప్రదేశం ఇదట.

ఊసి లింగం: ఊసి అంటే తమిళంలో సూది అని అర్థం..ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది.

పచ్చయ్యమ్మ గుడి: ఇక్కడ శ్యామలాదేవి పచ్చయ్యమ్మన్ స్వరూపంలో కొలువైంది.

ఈశాన్య లింగం, యజమాన నంది: ఇక్కడితో అష్టదిక్పాలకుల లింగాల దర్శనం పూర్తవుతుంది.

ప్రవాళ పర్వతం:  గిరి ప్రదక్షిణలో ఆఖరి ప్రదేశం ఇది. రమణమహర్షి తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశం ఇది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఏ రాశిలో పుట్టిన వారు ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×